సినిమాల్లో వచ్చే కొన్ని సన్ని వేశాల కోసం వేసే సెట్స్ ఎంత అందంగా ఉంటాయో చెప్పలేం. వాటి ఖర్చు కూడా అంతే మందంగా ఉంటుందనుకోండి. అది వేరే విషయం. ఇక ముఖ్యంగా తివిక్రమ్ సినిమాలో కనిపించే బంగళాలు ఎంతగా రిచ్‌గా ఉంటాయంటే, అది ఇల్లా ఇంద్ర భవనమా అనిపించేలా ఉంటాయి. కొన్ని కొన్ని సినిమాలకోసం సెట్ తయారు చేపిస్తే, కొన్ని కొన్ని సినిమాల్లో నిజంగానే అంతగా అందమైన ఇల్లు ఉంటాయి.

 

 

ఇకపోతే ‘అత్తారింటికి దారేది’ చిత్రం కోసం రామోజీఫిల్మ్ సిటిలో ఓ పెద్ద బంగ్లా సెట్ వేయించిన త్రివిక్రమ్ ... అల వైకుంఠపురానికి మాత్రం రియల్ ఇంట్లోనే షూట్ చేయడం విశేషం. ఆ ఇళ్లును చూడాలంటే రెండుకళ్లు చాలవనిపిస్తుంది. ఇంత అందంగా, అతి సుందరంగా కనిపించే ఆ నివాసం ఎవరిదో ఎక్కడుందో తెలిస్తే షాకవడం ఖాయం. ఇక సుమారు రూ. 300 కోట్ల విలువచేసే అత్యంత విలాసవంతమైన ఆ ఇల్లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉంది.

 

 

ఇక ఒకసారి అనుకోకుండా ఆ ఇంటిని చూసిన త్రివిక్రమ్, తన కథకు సరిగ్గా సరిపోయే ఇల్లు దొరికిందని ఫిక్సయ్యి, వెంటనే యజమానులతో మాట్లాడి ఒప్పించుకున్నాడట... అలా ఇప్పుడు ఆ ఇల్లు వైకుంఠపురముగా మారి సినిమాలో కీ రోల్ పోషించింది. సుమారు 20 రోజుల పాటు ఆ ఇంట్లో సినిమా షూట్ చేశారు.. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించేస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ‘అల వైకుంఠపురములో’ కనిపించే ఈ ఇల్లు ఒక  ప్రముఖ న్యూస్ ఛానెల్ అధినేత కుమార్తెకు సంబంధించినదట.

 

 

ఈ ఇంటి గార్డెన్ లో పూసే పూలకు కూడా పేటెంట్ ఉంది. ఇటలీ నుంచి తెప్పించిన విలువైన మొక్కలు ఆ ఇంట్లో ఉన్నాయి. ఇక ఆ ప్రముఖ న్యూస్ చానల్ అధినేత ఎవరా అని ఆలోచిస్తున్నారా, అక్కడికే వస్తున్న అతనే ఎన్ టీవి అధినేత నరేంద్ర చౌదరి ఏకైక కూతరు రచన ది కావడం విశేషం. ఇక ఈ ఇల్లు బన్నీకి పిచ్చ పిచ్చగా నచ్చడం వల్ల తాను కూడా ఇలాంటి ఇల్లు ఒకటి నిర్మించాలని అనుకుంటున్నాడట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: