ర‌జ‌నీతో సినిమా అంటే అదిరిపోయే క‌థ‌, క‌థానాలు కొత్త‌గా ఉండాలి.. కానీ మ‌రీ రొటీన్ క‌థ తీసుకుని నిరుత్సాహ ప‌రిచాడు. ఎంత క‌థ‌నం , స్క్రీన్ ప్లే మాయ చేద్దామ‌నుకున్నా క‌థ వీక్‌గా ఉండ‌డంతో సినిమాకు పెద్ద లోటు. మురుగ ర‌జ‌నీతో 15 ఏళ్ల‌కు వ‌చ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్నాడ‌నే చెప్పాలి. ఇంకా కేర్ తీసుకుంటే గొప్ప సినిమా అయ్యేది

 

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పరిచయం అక్కరలేని పేరు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్న హీరో.. 168 కి పైగా సినిమాలలో నటించారు ఘనత ఒక్క రజినీ కాంత్ కే సొంతం..ఆయన కున్న క్రేజ్ వల్లే ఇన్ని రోజులు సినిమాలలో రాణిస్తున్నారు..అందుకే తెలుగు, తమిళ్ లో ఆయనకు అభిమానులు ఎక్కువే అని అందరికీ తెలిసిందే..

 

సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ అయిన తమిళ సినిమా దర్బార్‌. సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్‌ అధికారి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో రజనీకి జోడిగా లేడీ సూపర్‌ స్టార్ జోడీగా నయన్ నటించింది..

 

అయితే ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్‌పై నయనతార ఇటీవల విమర్శలు చేసింది. దర్శకుడు తన పాత్ర చెప్పినట్టుగా చిత్రీకరించలేదని, తన లుక్‌ కూడా అంత బాగాలేదని కామెంట్ చేసింది. ఈ విమర్శలపై స్పందించిన మురుగదాస్‌ తాను అన్ని పాత్రలను ఓకే దృష్టితో రూపొందిస్తానన్నాడు..లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఇటీవల దర్బార్‌ సినిమాలో మరోసారి మురుగదాస్‌ డైరెక్షన్‌లో నటించింది నయనతార. అయితే ఈ సినిమా విషయంలో కూడా నయన్‌ హర్ట్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది...ఆ సినిమాలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆమె ఫైర్ అయిందని సమాచారం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: