హీరో వేణు, లయల కలయికలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కి మంచి సక్సెస్ సాధించిన స్వయంవరం సినిమాతో కథ, మాటల రచయితగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, మన్మధుడు, జై చిరంజీవి వంటి సినిమాలకు కథ మాటలు అందించి రచయితగా ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత తరుణ్, శ్రియల కలయికలో తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమా ద్వారా తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన త్రివిక్రమ్, ఫస్ట్ మూవీ తోనే మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు, అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రెండవ సినిమాగా అతడు సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టి, ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించారు. 

 

ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో జల్సా, అల్లు అర్జున్ తో జులాయి వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి మంచి పేరు గడించిన త్రివిక్రమ్, ఇప్పటివరకు కెరీర్ పరంగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా చవి చూసారు. ఇక కొన్నాళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన తీసిన అజ్ఞాతవాసి సినిమా ఘోరంగా ఫెయిల్ అవడంతో పాటు ఆ సినిమాపై ఒక ఫ్రెంచ్ సినిమా కాపీ అంటూ త్రివిక్రం పై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం కొంత ఆలోచనలో పడ్డ త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అనే యాక్షన్ ఎంటర్టైనర్ తీసి హిట్ కొట్టారు. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆయన తీసిన అలవైకుంఠపురములో సినిమా బాగానే టాక్ ని సంపాదించి ముందుకు సాగుతోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఈ సంక్రాతి సీజన్ సందర్భంగా రిలీజ్ అయిన మహేష్ సరిలేరు నీకెవ్వరు, 

 

రజిని దర్బార్, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు ఆశించిన రేంజ్ లో టాక్ ని దక్కించుకోకపోవడం చాలావరకు అలవైకుంఠపురములో సినిమాకు ఒకింత కలిసి వచ్చిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆ సినిమాను కనుక పరిశీలిస్తే, గతంలో త్రివిక్రమ్ తీసిన కొన్ని సినిమాల్లోని సీన్స్, కథనాన్ని కాపీ కొట్టినట్లుగా స్పష్టంగా అర్ధం అవుతుందని కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే చెప్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ పెన్ కు ఎంతో పవర్ ఉందని, అటువంటి ఆయన, ఈ విధంగా తన సినిమాల్లోనే సీన్స్ నే పదే పదే మర్చి మార్చి తీయడం వలన ప్రేక్షకుల దృష్టిలో కొంత పేరును కోల్పోతున్నారని, కావున ఇకనైనా ఆయన నుండి మంచి ఫ్రెష్ కథలతో సినిమాలు వస్తాయని ఆశిస్తున్నట్లు వారు చెప్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: