టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కొన్నాళ్ల నుండి వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తో హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చిన పూరి, అతి త్వరలో విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే మూవీ ని తెరకెక్కించనున్నాడు. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై హీరోయిన్ ఛార్మితో కలిసి పూరి నిర్మించనున్న ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా ఫీల్ తో భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇటీవల హీరో విజయ్ మార్షల్ ఆర్ట్స్, కుంగ్ ఫు వంటి పలు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడని ఛార్మి నిన్న వీడియో పోస్ట్ ద్వారా తెల్పడం జరిగింది. 

 

విజయ్ దేవరకొండ తొలిసారిగా ఇటువంటి విద్యల్లో శిక్షణ తీసుకోవడం కోసం ఎంతో శ్రమిస్తున్నాడని, అలానే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అదిరిపోనుందని టాక్. పూరి మార్క్ టేకింగ్, డైలాగ్స్, యాక్షన్ తో పాటు అదిరిపోయే రేంజ్ లో ఫైట్స్ ఈ సినిమాలో ఫైట్స్ ఉండనున్నాయని అంటున్నారు. తెలుగు హిందీతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. పూరి, విజయ్ ల కెరీర్ లో ఇప్పటివరకు ఖర్చుపెట్టని భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కనుండడంతో విజయ్, పూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. 

 

ఇక ఇటీవల ఇస్మార్ట్ శంకర్ మూవీకి సంగీతాన్ని అందించిన మణిశర్మనే మరొక్కసారి ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా పూరి ఎంచుకున్నారు. మంచి మాస్, యాక్షన్ తో సాగనున్న ఈ సినిమాకు అలరించే సాంగ్స్ తో పాటు అదిరిపోయే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా మణిశర్మ కంపోజ్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి థమన్, దేవిశ్రీ లకు మంచి పోటీ ఇచ్చేనందుకు సిద్దమైన మణిశర్మ, ఈ సినిమాతో కనుక ప్రేక్షకులను అలరించేలా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనుక అందిస్తే పూర్తి స్థాయిలో ఫామ్ లోకి వచ్చినట్లే. మరి మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ ఈ సినిమాకు ఎంతవరకు కీలకం అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ సమయం వరకు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: