టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలతో ప్రస్తుతం బిజీగా హీరోయిన్ గా కెరీర్ ని లీడ్ చేస్తోంది ముంబాయి బ్యూటి పూజా హెగ్డే. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, బాలీవుడ్ సినిమాలు కూడా వరుసగా చేస్తోంది. ఒకేసారి 2 కంటే ఎక్కువ సినిమాలు చేయడం ఇబ్బంది అనిపించదా అనే ప్రశ్నకు పూజా హెగ్డే డిఫరెంట్ గా సమాధానమిచ్చింది. ఈ సమాధానం ఏవ్రికో అర్థమయ్యో ఉంటుంది. ఒకేసారి 4 సినిమాలు చేసేంత కెపాసిటీ తనకు ఉందంటోంది పూజా. ఇది ఇన్‌డైరెక్ట్ గా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మేకర్స్ కి చెబుతోంది. ఒకేసారి అక్కడ ఇక్కడ అవకాశాలు వచ్చినప్పటికి చేయగిలిగే సత్తా తన కుందని పూజా తెలివిగా హింట్ ఇచ్చింది. అంతేగా మరి హీరోయిన్స్ కి స్పాన్ బాగా తక్కువ. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న మాట బాలీవుడ్ లో చేసిన మొహంజాదారో సినిమాతో అర్థమైనట్టుంది. ఆ సినిమా కోసం టాలీవుడ్ లో కొన్ని ఛాన్సెస్ ని మిస్సయ్యింది. ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయకుండా కాస్త అలర్ట్ గా ఉంటోంది.

 

రెండు భాషల్లో రెండు సినిమాలు ఎవరైనా చేస్తారు. నేను మాత్రం డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఒకేసారి 4 సినిమాలు చేయగలను. ఆ కెపాసిటీ నాకు ఉంది. ఇప్పుడు తెలుగులో 2 సినిమాలు చేస్తున్నాను, సేమ్ టైమ్ హిందీలో కూడా 2 చేయగలను. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే ఆ భాషలో సినిమాలు చేస్తాను...అంటూ క్లారిటి ఇచ్చింది. అల వైకుంఠపురములో సినిమాలో తను చేసిన అమూల్య పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది పూజాకు. అంతేకాదు బన్నీతో మళ్లీ మళ్లీ నటించాలనే కోరికను కూడా బయటపెట్టింది. తన ఫేవరెట్ స్టార్ అల్లు అర్జున్ అని చెబుతోంది. ఇక పూజా బన్నీ తో ఇప్పటికే దువ్వాడ జగన్నాధం, అల వైకుంఠపురములో సినిమాలలో నటించిన సంగతి.

 

అల్లు అర్జున్ నా ఫేవరెస్ట్ స్టార్. ప్రభాస్ తో కూడా వర్క్ ఎక్స్ పీరియన్స్ బాగుంది. కాకపోతే బన్నీతో ఆల్రెడీ ఓ సినిమా చేయడంతో అల వైకుంఠపురములో అతడితో చాలా కంఫర్ట్ గా నటించగలిగాను. అదే తెరపై కెమిస్ట్రీగా పండింది. నాతో మళ్లీ నటిస్తానని బన్నీ అన్నాడు. నేను కూడా రెడీ...అంటు సంబరపడుతూ చెబుతోంది. ఇక హౌజ్ ఫుల్ 4కు అలవైకుంఠపురములో సినిమాకు ముడిపెట్టింది పూజా హెగ్డే. హౌజ్ ఫుల్-4లో కామెడీ ట్రై చేశానని, అల వైకుంఠపురములో సినిమాకు అది తనకు ప్లస్ అయిందని చెప్పుకొచ్చింది. పైగా ఎక్కువమంది నటీనటులున్న సీన్ లో ఎలా నటించాలో హౌజ్ ఫుల్-4లో నేర్చుకున్నానని అంటోంది. మొత్తానికి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలవడానికి బాగానే ప్లాన్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: