అమ్మాయిలకు తండ్రి అంటే ఎక్కువ ఇష్టం అంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం తన తండ్రి లేకుంటేనే తమ జీవితాలు బాగుపడ్డాయంటోంది. ఆయన తమను విడిచిపోయిన రోజే తమ జీవితాల్లోలక్కీడే అంటోంది. ఎవరా హీరోయిన్.. ఎందుకు అలా అంటోంది.. హీరోయిన్ పేరు ఖుష్బూ..

 

ఖుష్బూ.. దక్షిణ భారతదేశంలో ఈపేరు తెలియని సినీ అభిమాని ఉండడేమో. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇలా దక్షిణ భారత దేశ భాషల్లోనే కాదు.. ఉత్తరాదిన కూడా హీరోయిన్ గా రాణించిన నటీమణి ఖుష్బూ.. ఇక తమిళనాట హీరోయిన్లకు గుడి కట్టే సంప్రదాయం ఖుష్బూతోనే మొదలైంది. అంతగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారామె. ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయినా ఇంకా ఆమె తెరపై తన ప్రాధాన్యత కోల్పోలేదు. ఇటీవలే రజినీకాంత్ తో మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధమవుతుందామె.

 

ఇటీవల ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం బయటపెట్టింది. మీలైఫ్‌లో లక్కీ డే ?ఏది అని అడిగితే.. ఇలా చెప్పింది. “ 13 సెప్టెంబరు 1986. మా నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయిన రోజు. అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఆయన వెళ్లి ఉండకపోతే నాపై నాకు నమ్మకం కలిగి ఉండేది కాదు.. అని బదులిచ్చింది.

 

మీ తండ్రి ఏం చేస్తారు? అని అడిగితే.. “ ఇప్పుడు ఆయన మాతో ఉండటం లేదు. 1986లో మా కుటుంబంలో కొన్ని సంఘటనలు జరిగాయి. అప్పటి నుంచి ఆయన మాతో ఉండటం లేదని చెప్పింది. అంతే కాదు.. నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటా. అయితే ఏది చెప్పాలనుకున్నా.. ముఖం మీదే చెప్పేస్తానని ముక్కుసూచిగా చెప్పేసింది ఖుష్బూ. కమల్‌హాసన్‌ ను చూస్తే ఏదైనా నేర్చుకోవాలని అనిపిస్తుందని ఆయన తపన కలిగిన వ్యక్తి. ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ ఉంటానని చెప్పింది ఖుష్బూ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: