ఇప్పుడున్న పరిస్దితుల్లో నేరాలు చేయడం చాలా సులువు అనే నిజం ప్రతి వారికి అర్ధం అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయిలను ఏడిపించాలంటే భయపడే వారు. ఎక్కడో ఒక్క చోట బ్రతుకు మీద తీపిలేనివాడు యాసిడ్ దాడులకు పాల్పడేవాడు. కాని నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, మనుషుల ప్రాణాలు తీయడం ఎంత సులువో అర్ధం అవుతుంది.

 

 

ఇలా లోకంలో జరుగుతుందంటే మనుషుల్లో మానవత్వం, ప్రేమ తాలూకు ప్రేరణ పూర్తిగా నశించిందని అర్ధం అవుతుంది. ఎవరికి ఎవరు ఏం కారు అనే రీతిగా బ్రతకడానికి అలవాటు అవుతుంది ఈ సమాజం.. మనిషికున్న విలువల్ని మట్టిలో కప్పి పెట్టి, కౄరంగా మారుతున్నాడు మానవుడు. ఇకపోతే ఈ మద్యకాలంలో ప్రజల ప్రాణ, మానాలకు హాని కలిగించే ఎలాంటి వస్తువులను అయినా అమ్మడం నిషేధించారు.

 

 

ఒకవేళ తప్పని సరిగ్గా ఆ వస్తువు కనుగోలు చేయాలంటే గుర్తింపు కార్డు చూపించాలి. ఇలా ఇప్పుడు పెట్రోల్ పంపుల్లో సిసాల్లో పెట్రోల్ నింపడం లేదు. ఇలాగే ప్రతి హానికర సంబంధమైన విషయంలో రూల్స్ కఠినంగా మార్చితే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇకపోతే ఒక వ్యక్తి దగ్గరకు ఎవరైనా వచ్చి యాసిడ్ అడిగితే అతని గుర్తింపుకార్డు చూడాలి, చిరునామా తీసుకోవాలి.. ఆపై ఫలానా వ్యక్తి యాసిడ్‌ కొన్నాడనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి.

 

 

కానీ ఇవేవీ జరగడం లేదంటున్నారు కథానాయిక దీపికా పదుకొణె. యాసిడ్‌ దాడుల్ని అరికట్టేందుకు ఆమె తాజాగా మరో సరికొత్త ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో తేలిందేమిటంటే మన దేశంలో యాసిడ్‌ కొనడం చాలా సులభమని, తన బృందం ద్వారా 24 యాసిడ్‌ సీసాలను కొనిపించి నిరూపించారు దీపిక..

 

 

ఇక ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రమాదకరమైన వస్తువుల విక్రయాల్లో మార్పులు తెచ్చి, వాటిని నియంత్రించాలని కోరారు.. లేదంటే ఈ రోజు యాసిడ్ రేపు మరేదైన సులువుగా కొని నేరాలు చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.. అందుకే అంటారు చట్టంలోని లొసుగులు తెలిసిన వాడికి నేరం చేసి తప్పించుకోవడం చాలా  సులువు అని....

మరింత సమాచారం తెలుసుకోండి: