ఈమధ్య సెక్స్ రాకెట్ ముఠాలు  రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుని డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎక్కువగా సెక్స్ రాకెట్లో మునిగి తేలుతున్నారు. ఖరీదైన భవనాలను అద్దెకు తీసుకుని అందులో మసాజ్ సెంటర్ల పేరుతో సెక్స్ రాకెట్ గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న వారు ఎంతోమంది. ఇలా సెక్స్ రాకెట్ నడుపుతున్న వారిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నప్పటికి కూడా వారి తీరులో మార్పు రావడంలేదు. ఈ మధ్య కొంతమంది సినిమాలకు సంబంధించిన వాళ్ళు కూడా సెక్స్ రాకెట్ లో భాగంగా మారుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులకు వలపన్ని క్యాస్టింగ్ డైరెక్టర్ లు సెక్స్ రాకెట్ ముఠాలో దింపుతున్నారు. 

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. జూనియర్ ఆర్టిస్టులతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్న బాలీవుడ్ కు  చెందిన ఓ క్యాస్టింగ్ డైరెక్టర్కు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... నవీన్ కుమార్ ప్రేమ్ లాల్ ఆర్య అనే వ్యక్తి బాలీవుడ్లో క్యాస్టింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇక డైరెక్టర్ గా వస్తున్న మని  సరిపోక ఎక్కువ సంపాదించాలనే కోరికతో అడ్డదారులు తొక్కాడు . ఈజీ మనీ కోసం నీచ  ఆలోచన చేసాడు. స్నేహితులు అజయ్ శర్మ విజయ లతో కలిసి వ్యభిచార దందా కు తెర లేపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వల వేసి ఆపై వారితో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టేసాడు. గత ఐదేళ్ల నుంచి నిరాటంకంగా ఈ వ్యక్తి మొదలుపెట్టిన వ్యభిచార దందా సాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యభిచార దందా కు పోలీసులు చెక్ పెట్టారు. 

 

 

 సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు... విటుల్లా  నటించి ఈ వ్యభిచార దందా గుట్టు రట్టు చేశారు. బయట వ్యక్తులలాగా  నవీన్ కి ఫోన్ చేసి అమ్మాయిలు కావాలని పోలీసులు అడిగారు. డీల్ ఓకే అయిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు పంపుతున్నట్లు నవీన్ ఫోన్ ద్వారా తెలిపాడు. అయితే ఒక్కో మహిళకు 60 వేల రూపాయల ఖర్చుతో పాటు హోటలు ఖర్చులు కూడా భరించాలని ఫోన్ లో బేరం కుదుర్చుకున్నాడు. ఇక పోలీసులు కూడా నవీన్ చెప్పిన అన్నింటికీ సరే అనడంతో అమ్మాయిలతో కలిసి హోటల్ కు  వచ్చిన నవీన్ ను  పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: