‘అల వైకుంఠపురములో’ మూవీ కి టోటల్ పాజిటివ్ టాక్ రావడమే కాకుండా ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలోని మాస్ ప్రేక్షకులకు కూడ బాగా నచ్చడంతో ఈ మూవీ ఏరేంజ్ హిట్ గా మారి కలక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టిస్తుంది అన్న విషయమై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆ సక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీని చూసే ప్రతివారికి ఈ మూవీలోని ‘అల వైకుంఠపురము’ ఇల్లు చూసి ఆశ్చర్య పడేలా ఉంటుంది. 

రాజసం ఉట్టి పడుతున్న మెయిన్ గేటు నుండి ఆ ఇంటి పోర్టి కో వరకు కనిపించే భారీ లాన్స్ తో పాటు ఆ ఇంటి ఎలివేషన్ ప్రతి వ్యక్తిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. వాస్తవానికి ఇలాంటి ఒక భారీ ఇంటిని ఊహించుకున్న త్రివిక్రమ్ ఇలాంటి ఇల్లు ఎక్కడ నిజంగా కనిపిస్తుంది అని త్రివిక్రమ్మూవీ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ తో చాల లోతుగా ఆలోచనలు చేసినట్లు టాక్. 

అయితే అనుకోకుండా త్రివిక్రమ్ ఊహించుకున్న ‘అల వైకుంఠపురము’ హైదరాబాద్ లోనే వాస్తవంగా కనిపించడంతో త్రివిక్రమ్ షాక్ అయినట్లు సమాచారం. ఈ మూవీలో చూపించిన ఇంటిని పోలిన పూర్తి రూపురేఖలతో భాగ్యనగరంలో ఒక మేన్షన్ వారికి కనిపించింది. ఆ మేన్షన్ ప్రముఖ ఛానల్ చైర్మెన్ చౌదరి కూతురు రచన అత్తవారిది అని తెలుస్తోంది.

ఈ సినిమాను నిర్మించిన హారిక హాసిని అధినేత రాథాకృష్ణ కు ఈ మేన్షన్ యజమాని దగ్గర చుట్టం కావడంతో ఆ మేన్షన్ ను త్రివిక్రమ్ బయట నుండి షూట్ చేయడమే కాకుండా ఈ మూవీలో అల్లు అర్జున్ ఆ భారీ మేన్షన్ లోకి నడుచుకు వచ్చే సన్నివేశాలు అన్నీ రియల్ గా మేన్షన్ లో తీసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఆ మేన్షన్ ను పోలిట్లుగా ఒక భారీ సెట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో 5 కోట్ల ఖర్చుతో త్రివిక్రమ్ తన ఊహల అల వైకుంఠపురమును నిర్మించినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మాటలు మాత్రమే కాకుండా అతడి ఊహలు కూడ ఎంత డిఫరెంట్ గా ఉంటాయి అన్నది ‘అల వైకుంఠపురములో’ సెట్ చూసిన వారికి అర్ధం అయ్యే నిజం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: