సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిన విషయమే. సినీ ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్వించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఎఫ్ 2.ఈ  సినిమాలో  సీనియర్ హీరో వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించగా వీరిద్దరి సరసన తమన్నా మెహ్రిన్ నటించారు. నటన విషయంలో ఈ నలుగురు అదరగొట్టారు అనే చెప్పాలి. సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరూ పగలబడి మరి నవ్వుకునేలా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 హిట్ తర్వాత ఎఫ్ 3 సినిమా కూడా రాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎఫ్ 2 సినిమా అఖండ విజయం సాధించడంతో ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఛాన్స్ కొట్టేశాడు దర్శకుడు .

 

 

 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో  జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో కూడా ఫుల్ టైం కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కింది ప్రేక్షకులను ఆకర్షించే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి .ఎఫ్ 2 హిట్  మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తో సినిమా చేయడానికి చాన్స్ వచ్చింది అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి పలుమార్లు తెలిపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా వసూళ్ళ పరంగా దూసుకుపోతూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. 

 

 

 అయితే సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లో భాగంగా... ఎఫ్ 3 గురించి మాట్లాడారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఎఫ్ 3 సినిమా కోసం ఇప్పటికే ఓ లైన్ అనుకున్నానని అది ఎఫ్ 2 స్టయిల్లో  ఉండదు అని చెప్పుకొచ్చారు రావిపూడి. ఈ ఎఫ్ 3 సినిమా ఎఫ్ 2 కి  సీక్వెల్ కాదు అని తెలిపిన అనిల్ రావిపూడి... ఎఫ్ 3 లో  హీరో హీరోయిన్  లు వాళ్ళ కెరియర్ గోల్స్ మీద కథను నడిపిస్తానని... వినోదానికి మాత్రం ఢోకా ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. ఎఫ్ 3 అంటే ఫన్ ఫ్రాస్ట్రేషన్  అండ్ మోర్ ఫన్ అని వెల్లడించారు. అంతేకాకుండా ఎఫ్ 2 లో ఉన్న అందరూ లీడ్ స్టార్స్ ఎఫ్ 3 లో ఉంటారని చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: