రేడియో జాకీ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరో నాని..అక్కడ మంచి వ్యాఖ్యాతగా కొంతకాలం పనిచేసి అక్కడ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు నాని.. ఆ తర్వాత అసిస్టెంట్ కెమరా మెన్ గా , సినిమాటో గ్రాఫర్ గా పనిచేసిన నాని అష్టా చమ్మా సినిమా తో హీరో గా పరిచయమయ్యాడు.. ఆ సినిమా ఊహించ లేనంత హిట్ నీ అందుకుంది.. దానితో సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. 

 

తదుపరి నాని ఎన్నో విజయాన్ని అందుకున్న సినిమాలలో నటించి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు.. 25 సినిమాలకు పైగా నటించిన నాని చాలా హిట్ సినిమాలను అందుకున్నాడు . ఆ తర్వాత మొన్న వచ్చిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా హ్యాట్రిక్ కొట్టాడు..అలా నాని ప్రొడ్యూసర్ గా రెండు సినిమాలకు పనిచేశారు..ఆ సినిమాలు అనుకున్న హిట్ నో అందించలేక పోయాయి..

 

నాని కథానాయకుడిగా ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'వి'. సుధీర్‌బాబు, నివేదా ధామస్‌, అదితి రావు హైదరీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో నాని వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా, సంక్రాంతి రోజుతో 'వి'లో తన నటనకు సంబంధించి చిత్రీకరణ పూర్తయిందని నాని తెలిపారు. 

 

ఈ మేరకు ట్వీట్‌ చేశారు. 'సంక్రాంతి రోజు ముగిస్తున్నాం. ఉగాది రోజు మొదలెడదాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేశారు.అష్టాచమ్మా', 'జెంటిల్‌మెన్‌' తర్వాత నాని-ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు..తదుపరి శివ నిర్వాణ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమాకు టక్ జగదీష్ అని టైటిల్ నీ ఖరారు చేశారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: