ఒక మూవీ సూపర్ సక్సస్ ఆ మూవీకి దర్శకత్వం వహించిన దర్శకుడుకి మార్కెట్ పెరిగేలా చేయడమే కాకుండా అతడికి విపరీతమైన జోష్ ను ఇస్తుంది. అయితే త్రివిక్రమ్ కు మాత్రం ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ విపరీతంగా కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్. 

దీనికి కారణం త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేయవలసిన మూవీ. వాస్తవానికి తారక్ త్రివిక్రమ్ తో మరొకసారి సినిమా చేయడానికి అంగీకరించినా ఈ మూవీ స్పష్టంగా ఎప్పుడు మొదలవుతుంది అన్న క్లారిటీ త్రివిక్రమ్ కు కూడ లేదు. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ జూలైలో విడుదల అయితే ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు అన్నీ పూర్తి అయ్యేసరికి ఆగష్టు నెలాఖరు వచ్చేస్తుంది. దీనికితోడు త్రివిక్రమ్ జూనియర్ తో తీయబోయేది ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఆ మూవీ కోసం తారక్ బాగా సన్నబడి నాజూకుగా కనిపించాలి. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన తరువాత మాత్రమే జూనియర్ త్రివిక్రమ్ సినిమాలోని తన మూవీ లుక్ గురించి ఆలోచించే ఆస్కారం ఉంది.

ఇవన్నీ పూర్తి అవ్వాలి అంటే కనీసం మరో 9 నెలలు గడిచిపోతాయి. ఈలోపున అనుకోకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదా పడితే ఈసంవత్సరాంతం వరకు త్రివిక్రమ్ జూనియర్ కోసం వెయిట్ చేయాలి. ఇలా హిట్ వచ్చి కూడ సుమారు 9 నెలలు నుండి సంవత్సరకాలం ఖాళీగా ఉండటానికి ఏదర్శకుడు అంగీకరించడు. ఈగ్యాప్ లో నాని తో కాని శర్వానంద్ తో కాని ఒక మీడియం రేంజ్ సినిమా తీయాలని త్రివిక్రమ్ కు సూచనలు వస్తున్నా ఆ విషయమై నిర్ణయాలు తీసుకోలేక జూనియర్ కోసం అంతకాలం ఎదురు చూడలేక ‘అల వైకుంఠపురములో’ సక్సస్ తో ప్రస్తుతం త్రివిక్రమ్ టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అని టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: