నందమూరి సింహం బాలకృష్ణకు కోపం వచ్చినా అనుగ్రహం కలిగినా పట్టుకోవడం కష్టం అని బాలయ్య సన్నిహితులు చెపుతూ ఉంటారు. ప్రస్తుతం ఊహించని విధంగా బాలయ్యకు వచ్చిన కోపం బోయపటికి అనుకోని సమస్యలు తెచ్చి పెట్టింది అని వార్తలు వస్తున్నాయి. బాలయ్య బోయపాటి మూవీ ప్రాజెక్ట్ ప్రారభం అయినా ఈ ప్రాజెక్ట్ రెండు అడుగులు ముందుకు వేస్తే మూడు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంటూ రోజుకు ఒక సమస్య ఎదురౌవుతునట్లు టాక్. 

మూవీ ప్రాజెక్ట్ కు బడ్జెట్ పరమైన ఇబ్బందులు ఏర్పడటంతో బోయపాటి భారీ పారితోషికాలు ఇవ్వకుండా  మంచి క్వాలిటీ ఇవ్వగల సాంకేతక నిపుణులను అదే విధంగా భారీ పారితోషికాలు డిమాండ్ చేయని నటీనటులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మరిపోయాడన్న వార్త వినిపిస్తోంది. 

వాస్తవానికి  ఈ సినిమాకు మంచి ఖరీదైన సినిమాటోగ్రాఫర్ ను వేరే భాష నుంచి తీసుకురావాలని దర్శకుడు బోయపాటి అనుకున్నాడట. అయితే బడ్జెట్ పెరిగిపోతుంది అన్న ఆలోచనతో    బాలకృష్ణ  సూచనమేరకు బాలయ్యకు సన్నిహితుడైన సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ ను ఎంపిక చేసారు అన్న వార్తలు గతంలో వచ్చాయి. అయితే లేటెస్ట్ గా రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా   ‘రూలర్’ మూవీ విడుదల కావడం ఆ మూవీ భారీ ఫ్లాప్ గా మారి పోవడం జరిగిపోయింది.  

దీనికితోడు ఈ మూవీలో బాలకృష్ణ లుక్స్ పై సెటైర్లు పడటంతో పాటు ఈ మూవీలో బాలకృష్ణ విగ్ లుపై కూడ సరిగ్గా శ్రద్ధ తీసుకోలేదు అన్న కామెంట్స్ రావడంతో ఈ విషయమై తాను అందంగా కనిపించకపోవడానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ నే కారణం అని బాలయ్య ఫీలయినట్లు టాక్. దీనితో రామ్ ప్రసాద్ ను తప్పించి మరో మంచి సినిమాటోగ్రాఫర్ ను వెదకమని బాలయ్య బోయపాటికి సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ తల నొప్పులతో బాధ పడుతున్న బోయపాటికి ఇప్పుడు కొత్తగా సినిమాటోగ్రాఫర్ తలనొప్పులు ప్రారంభం అయ్యాయి అంటూ జోక్స్ పడుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: