త్రివిక్రమ్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక మాట వినపదేది.. బాగా ఏడ్పిస్తాడు.. కొంచెం నవ్విస్తాడు.. అదే ఆయన స్టయిల్ .. అందుకే ఆయన ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువే.. అందుకే ఆయన సినిమాలంటే ఎక్కడా తగ్గే సమస్యే ఉండదు.. ఒక మాటలతోనే డైలాగు తోనో సినిమా హిట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు..అదే మాటల రచయిత నుండి దర్శకుడిగా చూపించింది..

 

తెలుగు పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్స్ ను త్రివిక్రమ్ మరియు బన్నీ ఈ చిత్రం ద్వారా బ్రేక్ చెప్పాలి.ఇది వరకు పవన్ తో తీసిన మూడు చిత్రాల్లో మూడోది అందులోను జనవరిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి అదే గతి పడుతుంది అనుకున్న వారికి త్రివిక్రమ్ మరియు బన్నీలు చాచి పెట్టి గూబ మీద కొట్టేలా చేసారని చెప్పాలి, జ‌ల్సా, అత్తారింటికి దారేది హిట్ మూడోద అజ్ఞాత‌వాసి ప్లాప్ ఇప్పుడు బ‌న్నీ - త్రివిక్ర‌మ్ కాంబో మూడోది అది కూడా జ‌న‌వ‌రిలో రావ‌డంతో డౌట్ ప‌డిన వాళ్ల‌కు ఈ సినిమా హిట్‌తో బ్యాడ్‌సెంటిమెంట్ కు బ్రేక్ వేశారు..

 

అల వైకుంఠపురములో’ థియేట్రికల్ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.85 కోట్లకు విక్రయించారు. ఇప్పటికే రూ.59 కోట్లు వసూలైపోయింది. రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ పాయింట్‌కు చేరువైపోతుంది బన్నీ చిత్రం. ఇక అక్కడి నుంచి లాభాలు లెక్కేసుకోవడమే. యూఎస్‌లో ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.67 కోట్లు. ప్రస్తుతం అక్కడ వసూలైన షేర్ రూ.44 కోట్లు. ఇంకో రూ.23 కోట్లు వెనకబడి ఉంది. త్వరలోనే ఈ మొత్తం సరిచేసి లాభాల్లోకి వెల్లడం ఖాయం.

 

అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యధికంగా వసూలు చేసిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 127 కోట్ల గ్రాస్ వసూలు చేయగా అందులో రూ. 76 కోట్లు డిస్ట్రిబ్యూటర్ల షేర్. ఇప్పుడు ఈ రికార్డును ‘అల వైకుంఠపురములో’ బద్దలుకొట్టనుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 59.35 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. మరో ఒకటి, రెండు రోజుల్లో ‘సరైనోడు’ మార్కును దాటేస్తుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ఢీలా పడ్డ బన్నీకి ఈ సినిమా మాత్రం మళ్లీ క్రేజ్ ను తీసుకొచ్చింది.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: