తెలుగు సినిమాలకు వన్నె తెచ్చెని మహానటులు... నట సార్వభౌములు నందమూరి తారక రామారావు.  ఎన్టీఆర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సాంఘిక, జానపద, పౌరాణిక సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.  టాలీవుడ్ లో ఎన్టీఆర్ వారసులుగా నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  హరికృష్ణ తన తండ్రి వెంట రాజకీయాల్లోకి వెళ్లగా.. బాలకృష్ణ మాత్రం టాలీవుడ్ లో టాప్ హీరోగా చెలామని అవుతున్నారు.  ఆ మద్య నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కాలం చేసిన విషయం తెసిందే. ఆయన తనయులు నందమూరి జానకి రామ్ సైతం రోడ్డు ప్రమాదంలో మరణించారు. 

 

ఇక రెండో కుమారుడు, మూడో కుమారుడు నందమూరి కళ్యాన్ రామ్, జూ. ఎన్టీఆర్ లు వెండితెరపై హీరోలుగా అలరిస్తున్నారు.  తాజాగా  సతీష్ వేగ్నేస దర్శకత్వంలో కళ్యాన్ రామ్ నటించిన   'ఎంత మంచివాడవురా' నిన్న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాన్ రామ్ మాట్లాడుతూ.. తన తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణలతో పాటు తారక్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పారు.  ఇక తన తమ్ముడు ఎన్టీఆర్ తో మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉందని.. తారక్, నేనూ కలిసి సినిమా చేయాలని తన తండ్రికి ఉండేదని కళ్యాణ్ రామ్ చెప్పారు.

 

భవిష్యత్తులో తను ఎప్పుడు తారక్ తో సినిమాలు తీయడానికైనా రెడీ అన్నారు. అయితే తారక్ ని ఎప్పుడూ తమ్ముడు అని పిలవలేదని.. ఎందుకంటే  తారక్ తనతో కొన్నిసార్లు తండ్రిగా,  అన్నగా, తమ్ముడిగా.. మరికొన్ని సార్లు చిన్న పిల్లాడుగా కనిపిస్తాడని అతని ఎమోషన్ చాలా గొప్పదని అన్నారు. అందుకే స్టేజ్ పై కూడా ఎప్పుడూ నాన్నా అనే సంబోదిస్తానని అన్నారు. తన తండ్రి, అన్న లేని లోటు తారక్ తీరుస్తున్నాడని చాలా ఎమోషన్ అయ్యారు కళ్యాన్ రామ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: