అమ్మ‌కి సంబంధించిన సెంటిమెంట్ పెట్టి ఎన్ని సినిమాలు తీసినా కూడా ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన అన్ని సినిమాలు హిట్టే అయ్యాయి. అదే అమ్మ గొప్ప‌త‌నం దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అమ్మ కేరక్టర్లు అంటే ఇన్నేళ్లూ ఓ ట్రెండ్ లో ఉండిపోయారు. సెంటిమెంట్ - ఏడుపులు - అప్పుడప్పుడూ బాధ్యతలు.. ఇలాంటి మూస రోల్స్ నుంచి టాలీవుడ్ అమ్మలు బైటకి వచ్చేస్తున్నారు. ''ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం..ఎవరు పాడగలరు అమ్మ అను పాట కన్న తియ్యని రాగం.."అన్నాడో సినీ కవి..నిజమే అమ్మ ప్రేమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. 

 


తెలుగు సినిమాల్లో కొత్త తరం దర్శకులు.. మదర్ కేరక్టర్ ని వైవిధ్యంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక‌ప్పుడు త‌ల్లి అంటే ఏడుపులు, బాధ్య‌త‌లు అన్నీ ఇవే చూపించేవారు. అమ్మ లాలన గురించి అందంగా వర్ణించారు. అయితే, అమ్మగా ఆ పాత్రలో ఒదిగిపోయి వెండితెరపై చిరస్మరణీయంగా నిలిచిపోయేలా నటించారు కొందరు నటీమణులు.

 


వెండితెర పై మోడ్రన్ మదర్ గా చక్కగా ఒదిగిపోయింది నటి నదియా. తమిళ మలయాల భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమె ..‘మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ‘అ..ఆ' చిత్రంలో కూతురే తన సర్వస్వంగా భావించే అమ్మగా న‌టించింది. ఈ చిత్రంలో స‌మంత కూతురు. మేటి నటి జయసుధ కూడా తల్లిపాత్రల్లో తనదైన ముద్రవేశారు.  ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి' , ‘బొమ్మరిల్లు' కొత్తబంగారు లోకం' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' ‘ఎవడు' ఊపిరి, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో అమ్మ ప్రేమ కురిపిస్తూ ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు.

 

ఓ దశలో టాలీవుడ్‌ని ఏలిన హీరోయిన్‌. హీరోయిన్‌గా విభిన్న పాత్రలు పోషించిన వారిలో రమ్యకృష్ణ పేరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. రాజమౌళి ‘బాహుబలి’ మాత్రం రమ్యకృష్ణకు ఎనలేని పేరు తీసుకొచ్చింది. సుహాసిని నాటి తరం నుంచి నేటి తరం వరకు ఎంతో మంది ప్రముఖ హీరోలతో నటించి పేరు పొందారు. పెదబాబు, గబ్బర్ సింగ్, లీడర్, వరుడు వంటి సినిమాల్లో తల్లి పాత్రలతో తనదైన ముద్రవేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: