సంక్రాంతి సినిమాల్లో బన్నీ, మహేశ్ మధ్యనే పోటీ నడిచింది. ఈ పోరులో బన్నీ అల.. వైకుంఠపురములో మహేశ్ సరిలేరు నీకెవ్వరూ కంటూ ఓ మెట్టు పైన నిలిచింది. సినిమా కంటెంట్ విషయంలో కానీ, కలెక్షన్ల విషయంలో కానీ మహేశ్ కు భారీ పోటీనిచ్చాడు బన్నీ. ఫ్యామిలీ కంటెంట్ తో మాస్ ఆడియన్స్ ను కూడా ధియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాడు. మహేశ్ కు ఎప్పటినుంచో మెగా హీరోల నుంచి పోటీ తప్పటం లేదు. మహేశ్ కు ఎప్పుడు ఇలాంటి పోటీ వచ్చినా మెగా హీరోలు ఓ మెట్టు పైనే నిలుస్తున్నారు.

 

 

పోకిరి రికార్డులను మగధీర రెండు రెట్లు మార్జిన్ తో కొట్టేసింది. దూకుడు రికార్డులను తర్వాత ఏడాదే గబ్బర్ సింగ్ తో తుడిచేశాడు పవన్. 2013లో చరణ్ నాయక్ తో మహేశ్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో పోటీ పడితే నాయక్ కు కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి. 2014లో కూడా చరణ్ తో పోటీ పడ్డ మహేశ్.. తన వన్ నేనొక్కడినే ఫ్లాప్ కాగా.. చరణ్ ఎవడు హిట్ అయింది. మహేశ్ శ్రీమంతుడు రికార్డులను చిరంజీవి ఖైదీ నెం.150తో తిరగరాశాడు. 2018లో రామ్ చరణ్ రంగస్థలంతో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశాడు. రెండు నెలల గ్యాప్ లో వచ్చిన మహేశ్ భరత్ అనే నేను సినిమా మంచి కలెక్షన్లు వచ్చినా రంగస్థలంను ఏమాత్రం అందుకోలేక పోయింది.

 

 

ఇప్పుడు సంక్రాంతికి మొదటిసారి అల్లు అర్జున్ తో పోటీ పడ్డాడు మహేశ్. సరిలేరు.. ఐదు రోజుల రికార్డులను బన్నీ నాలుగు రోజుల్లోనే సమం చేశాడు. అల.. కు ధియేటర్లు పెంచుతున్నారు.. ప్రేక్షకులు క్యూలు కడుతున్నారు. 95 శాతం ఫుల్స్ తో రన్ అవుతోంది. సంక్రాంతి విన్నర్ గా ఇప్పటికే అల.. డిక్లేర్ అయిపోయింది. దీంతో మహేశ్ కు మెగా హీరోల గండం తప్పటంలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: