ట్రిపుల్ ఆర్ లోనే కాదు తర్వాతి మూవీ విషయంలోనూ పోటీపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. రాజమౌళి తర్వాత ఇద్దరూ ఒకే డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పరిచయాలన్నింటినీ ఉపయోగిస్తూ.. పంచ్ లు పేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి తారక్, చరణ్ ఏ దర్శకుడి కోసం పోటీ పడతున్నారో ఓ సారి పరిశీలిస్తే.. !

 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఇండియాస్ మోస్ట్ అవైటడ్ మూవీ ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నారు. తారక్ మన్యం వీరుడు కొమరం భీమ్ పాత్ర పోషిస్తుంటే, రామ్ చరణ్ విప్లవకారుడు అల్లూరి సీతారామరాజులా కనిపిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో 350 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణవుతోన్న ఈ సినిమా జులై 30న విడుదల కాబోతోంది. 

 

ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలనుకుంటున్నారు ఎన్టీఆర్. ఈ మూవీని చినబాబుతో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అరవింద సమేత సినిమాతో మెమరబుల్ మూవీ ఇచ్చిన పంచ్ మాస్టర్ తో కలిసి మరో హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. 

 

రామ్ చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమాకు ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బాబాయ్ వవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రాజెక్ట్ చేశాడని, వచ్చే ఏడాది ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశముందని సమాచారం. చినబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక చరణ్మూవీ కంటే ముందు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవితో కలిసి నటించబోతున్నాడు. మొత్తానికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నటించబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు అభిమానులు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: