ఈసంక్రాంతికి  చివరి సినిమాగా వచ్చిన చిత్రం  కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా .. నిన్న విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్ ను రాబట్టి ఓకే అనిపించింది. నిన్న సంక్రాంతి కావడంతో మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2.10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.  ఫ్యామిలీ డ్రామాగా  శతమానం  భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న  డైరెక్ట్ చేసిన  ఈ సినిమాలో  కాన్సెప్ట్  బాగున్నా బోరింగ్ స్క్రీన్ ప్లే , రిపీటెడ్ సీన్స్  సినిమా కు మైనస్ అయ్యాయి. దాంతో  నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికితోడు ప్రస్తుతం సరిలేరు  నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండడం తో ఎంత మంచివాడవురా నిలదొక్కుకోవడం కష్టమే. 
 
 ఇక గత ఏడాది 118తో హిట్ కొట్టి ట్రాక్  లోకి వచ్చిన కళ్యాణ్ రామ్  తాజాగా ఎంత మంచివాడవురా తో మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా , శ్రీదేవి మూవీస్ అధినేత శివ లెంక  కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి వాడవురా డే 1 కలెక్షన్స్ :
 
నైజాం - 0.60 కోట్లు 
సీడెడ్ - 0.37 కోట్లు 
ఉత్తరాంద్ర - 0.18 కోట్లు 
గుంటూరు -0.19 కోట్లు 
తూర్పు గోదావరి - 0.29 కోట్లు 
పశ్చిమ గోదావరి - 0.20 కోట్లు '
కృష్ణా - 0.19 కోట్లు 
నెల్లూరు - 0.08 కోట్లు 
మొత్తం మొదటి రోజు గాను షేర్ =2.10కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: