కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పంజాబీ సోయగం మెహ్రీన్ కౌర్‌ను చూసి మనాళ్లు ఫిదా అయిపోయారు. ఇక టాలీవుడ్ ప‌రిచ‌య‌మైన త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ ప్రేయార్టి సంపాదించుకుంది మెహ్రీన్‌. ఫస్ట్ మూవీలో పద్ధతిగా ఉన్నా తర్వాత రెచ్చిపోయింది. తన భారీ థైస్ తో రాజా ది గ్రేట్ అంటూ మరో హిట్ కొట్టింది. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ అప్పట్లో క్రియేట్ చేసిన ఒక అరుదైన రికార్డును మెహ్రీన్‌ సమం చేసింది. వాస్త‌వానికి ఒక టాప్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం చాలా రేర్ అనే చెప్పాలి.  

 

అటువంటి రేర్ ఫీట్ చేసిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. 1993 సెప్టెంబర్ 3న  నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల్లో నిప్పురవ్వ సినిమా ఓ మోస్త‌రుగా ఆడినా.. బంగారు బుల్లోడు సినిమా మాత్రం బాల‌య్య‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. పాత‌త‌రంలో ఎన్టీఆర్, కృష్ణ నటించిన చాలా సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలున్నాయి. ఇక ఇటీవ‌ల నాని హీరోగా నటించిన ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలు ఒకే రోజు రిలీజైయ్యాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి రికార్డుల‌ను ఎవ‌రు క్రియేట్ చేయ‌లేదు. 

 

కానీ, మెహ్రీన్ మాత్రం బాల‌య్య రికార్డును స‌మం చేసింది. తాజాగా క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్‌గా తెర‌కెక్కిన చిత్రం ఎంత మంచివాడవురా. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 15 సంక్రాంతి రోజున ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రోవైపు తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘పటాస్’ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజైంది. ఈ రకంగా ఈ తరంలో మెహ్రీన్ కౌర్హీ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. ఏదేమైన బాల‌య్య‌, నాని త‌ర్వాత ఆ రికార్డ్ మెహ్రీన్ ద‌క్కించుకుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: