సంక్రాంతి సినిమాల్లో మహేశ్ సరిలేరు నీకెవ్వరుతో భారీ పోటీ ఉన్నా కంటెంట్ పరంగా అల.. పైచేయి సాధించడంతో సంక్రాంతి విన్నర్ డిక్లేర్ అయిపోయాడు బన్నీ. ఆడియన్స్ కూడా అల..కు పట్టం కట్టడంతో కలెక్షన్లు కూడా అలాగే వస్తున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి బన్నీ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ పెన్నింగ్ తో పాటు.. మరో రెండు అంశాలు కీలకమయ్యాయి. బోర్డ్ రూమ్ ఎపిసోడ్ ఒకటైతే.. క్లైమాక్స్ లో శ్రీకాకుళం యాస పాటతో కూడిన ఫైట్ రెండోది.

 

 

ముఖ్యంగా బోర్డ్ రూమ్ ఎపిసోడ్ లో బన్నీ సోలో పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మహేశ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి.. లా వారి పాటల్లోని డ్యాన్స్ మాత్రమే కాదు.. వారి మేనరిజమ్స్ ను కూడా కరెక్ట్ గా పెర్ఫార్మ్ చేయడంలో బన్నీ 100 శాతం సక్సెస్ అయ్యాడు. దీనిని పరిశీలిస్తే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లోని ఎపిసోడ్ గుర్తురాక మానదు. ఆ సినిమా క్లైమాక్స్ లో పవన్ ఇదే తరహా ఎపిసోడ్ ను పెట్టాడు. పవన్ అక్కడ ఏకంగా చిరంజీవి ఫేమస్ ఐకాన్.. వీణ స్టెప్ ను కూడా వేసేశాడు. కానీ ఆ సినిమా దారుణ పరాజయాన్ని ఆ ఎపిసోడ్ ఏమాత్రం కాపాడలేకపోయింది. కానీ.. అల..వైకుంఠపురములో బన్నీ మాత్రం ఆ ఎపిసోడ్ లో ఇతర హీరోలను తన స్టైల్ ఆఫ్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

 

 

అల.. వైకుంఠపురములో హిట్ లో ఈ ఎపిసోడ్స్ కీలకంగా వ్యవహరించాయి. త్రివిక్రమ్ చాలా జాగ్రత్తగా రాసుకుని, శ్రద్ధగా తీసిన ఈ ఎపిసోడ్ కు బన్నీ ప్రాణం పోశాడు. ప్రస్తుతం అల.. వైకుంఠపురములో స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ధియేటర్లు కూడా పెంచుతున్నారు మేకర్స్. రానున్న రోజుల్లో రికార్డు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: