సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో టాలీవుడ్ మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ చిత్రంగా తెర‌కెక్కింది `సైరా న‌ర్సింహారెడ్డి`. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో విడుద‌ల చేశారు. అయితే ఇది ఒక చ‌రిత్రను చూపించే చిత్రం అందులోనూ చిరంజీవి లాంటి లెజండ‌రీ న‌టుడు  ఇందులో ఉండ‌డం వ‌ల్ల ఈ చిత్రానికి ఇంత ప్రాధాన్యత వ‌చ్చింది. 

 

ఇక ఈ చరిత్ర గురించి మ‌న తెలుగువాళ్ళే కాక వేరే దేశాల‌కు వ్యాపింప‌చేయాల‌ని ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుద‌ల చేశారు.  “బాహుబలి” లాంటి భారీ చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతి మరింత వ్యాప్తి చెందింది అందువల్లనే ఇప్పుడు ఈ చిత్రాన్ని చెయ్యడానికి బీజం పడింది అని మెగాస్టార్ స్వయంగా చెప్పారు. ఇక‌పోతే బాహుబ‌లి చిత్రం తెలుగు చిత్ర రంగాన్ని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళింద‌న్న విష‌యం తెలిసిందే. 

 

ఈ చిత్రాన్ని కూడా ఎక్క‌డా త‌క్కువ‌కాకుండా ఎమోష‌న్స్ మోతాదు కాస్త ఈ చిత్రంలో ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఎక్కువసార్లు జ‌నం చూడాలంటే క‌ష్ట‌మ‌నిపించింది. ఒక‌వేళ అలా ఎక్కువ సార్లు చూసి ఉంటే తెలుగులో రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. అంతే కాకుండా ఇతర భాషల్లో టెలికాస్ట్ చేస్తే అంతే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ ను కూడా ఈ చిత్రం సాధించింది. అలా బాహుబలి మరియు ఇప్పుడు సైరా చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్రనుజ‌ వేసుకున్నాయి.

 

సైరాని టీవీ ఛాన‌ల్లో ప్ర‌సారం చేసిన‌ప్పుడు మాత్రం ఖ‌చ్చితంగా `బాహుబ‌లి`టెలికాస్టింగ్ రోజులను ఒక‌సారి గుర్తు చేసుకున్నారు. మాములుగా అయితే ఓ సినిమాను ఛానెల్స్ వారు మూడు గంటల్లో ముగించేస్తారు. కానీ నిన్న సైరా అప్పుడు బాహుబలి రెండు చిత్రాలను కూడా నాలుగేసి గంటలు ప్రసారం చేశారు. దీంతో చూసే జ‌నాల‌కి విసుగు క‌లిగేలా మ‌ధ్య మ‌ధ్య‌ యాడ్స్‌ని కాస్త ఎక్కువ‌గా ప్ర‌సారం చేస్తూ విసుగు తెప్పించారు. మొత్తానికి పెద్ద హీరోల సినిమాలు కాబ‌ట్టి ఎలాగైనా చూస్తారు అన్న ఉద్దేశంలో కాస్త యాడ్స్ ఎక్కువ‌గా ఒప్పుకుని వేస్తూ జ‌నాల‌కి విసుగు పుట్టేలా చేస్తారు ఈ ఛానల్స్ వాళ్ళు. 

మరింత సమాచారం తెలుసుకోండి: