సిని పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా కొన్ని కావాల్సి ఉంటుంది. హీరోయిన్స్ విషయంలో మాత్రం టాలెంట్ ఒక్కటే కాదు దానికి తగిన అందచందాలు ఎక్స్ ట్రా బెనిఫిట్ అవుతాయి. అయితే కేవలం అందాలతో ఆకట్టుకున్నా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. సరైన కథకు సరైన విధంగా అటు అందంతోనూ అభినయంతోనూ మెప్పించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం అభినయాని కన్నా అందానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

 

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కొద్దిగా మొహమాట పడినా ఛాన్సులు రానప్పుడు మాత్రం అప్పటివరకు చేయని గ్లామర్ షో కూడా చేస్తారు. హీరోయిన్స్ గ్లామర్ షో స్టార్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కంటేంట్ లో దమ్ము ఉన్నా లేకున్నా కొందరు మేకర్స్ హీరోయిన్స్ అందాలతోనే సినిమా లాగించేస్తుంటారు. అయితే తమని తాము హాట్ గా ప్రెజెంట్ చేసుకోవడంలో కొందరి హీరోయిన్స్ కు అభ్యంతరాలు ఉండగా కొందరు మాత్రం ఎలాగైనా సరే క్రేజ్ తెచ్చుకోవాలని డైరక్టర్ అడిగిన దానికన్నా ఎక్కువ కోపరేట్ చేస్తారు.

 

హీరోయిన్ గా ప్రతిభ కనబరచినా స్కిన్ షో చేస్తేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండగలరు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా సత్తా చాటుతున్న హీరోయిన్స్ కూడా గ్లామర్ షోతో ఆకట్టుకున్నవారే. స్టార్ హీరోల సినిమాకు హీరోయిన్ గ్లామర్ ఎక్స్ ట్రా డోస్ వచ్చేలా చేస్తుంది. అయితే గ్లామర్ షో చేసినా వారి క్రేజ్ కు తగినట్టుగా డిమాండ్ చేస్తుంటారు హీరోయిన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ప్రకారంగా డిమాండ్ ఉన్నప్పుడే తమ అందాలతో మరికొన్ని సినిమాలు చేసి కొన్ని రాళ్లు వెనుకేసుకోవాలని చూస్తున్నారు భామలు. వాళ్లకు తగినట్టుగానే ఆఫర్లు కూడా రావడం విశేషం. బాలీవుడ్ తర్వాత హీరోయిన్స్ ను గ్లామర్ షోతో ప్రేక్షకులను అలరించడంలో మన టాలీవుడ్ ఉంటుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: