కోలీవుడ్, టాలీవుడ్ లో తమిళ హీరో విజయ్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన ఫ్యాన్స్ విజయ్ ని తలపథి అని పిలుచుకుంటారు. విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన దర్శకత్వంలో బాలనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించాడు.  ఆ తర్వాత మరోసారి తన తండ్రి దర్శకత్వంలోనే "నాలయ తీర్పు" (1992) లో నటించాడు.  అయితే విజయ్ కి మాత్రం హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది 1996లో విడుదలైన "పూవె ఉనక్కాగ".  విజయ్ నటించిన సినిమాలు తెలుగు లో డబ్ అవుతున్న విషయం తెలిసిందే.  

 

ఆ మద్య రిలీజ్ అయిన పోలీస్, అదిరింది, సర్కార్, విజిల్ మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.  విజయ్ ఒక హీరోగానే కాకుండా సామాజిక సేవాభావాలు కలిగిన వ్యక్తిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.  తన ఫ్యాన్స్ కి ఏ చిన్న కష్టమొచ్చినా స్వయంగా తానే వెళ్లి వారి బాధలు తీరుస్తారు.  ప్రకృతి వైపరిత్యాలు ఏలాంటివి వచ్చినా తనవంతు గొప్ప విరాళం అందిస్తుంటారు.  అయితే ఈ మద్య విజయ్ నటిస్తున్న ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో కాంట్రవర్సీలు వస్తున్నాయి.. కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నమూవీ ‘మాస్టర్’ . 

 

ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.  గతంలో ఈ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’ మంచి హిట్ అయ్యింది.  తాజాగా ‘మాస్టర్’ సినిమా నుంచి సెంకండ్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ పిక్ లో విజయ్ నల్ల చోక్కా, నల్ల కళ్లజోడు పెట్టుకుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. సైలెన్స్ అంటూ అతను చేసే సైగపై నెట్టింట్లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాస్టర్ నయా పిక్ ట్రెండింగ్ మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: