యువ కథాాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ మేహ్రీన్ హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా ఎంత మంచి వాడవురా... ఎప్పుడు కూల్ గా ఉండే కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూల్ గా ఉండే పాత్రల్లో కనిపిస్తాడు..అందుకే అతని సినిమాలు కూల్ గా కలెక్షన్లను రాబడుతాయి కూడా..అలా ఇప్పటికీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు..

 

తాజాగా కళ్యాణ్ నటించిన ఎంత మంచివాడవురా’. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం పట్ల సానుకూలంగానే స్పందించారు. కాగా ఎంత మంచివాడవురా చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఒకే కథనంతో ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు.. ఇప్పుడు చేసిన ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించడంతో సినిమా బాగా హిట్ అయిందనే చెప్పాలి..

 

నిన్న సంక్రాంతి కావడంతో మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2.10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఫ్యామిలీ డ్రామాగా శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాన్సెప్ట్ బాగున్నా బోరింగ్ స్క్రీన్ ప్లే , రిపీటెడ్ సీన్స్ సినిమా కు మైనస్ అయ్యాయి. దాంతో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికితోడు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండడం తో ఎంత మంచివాడవురా నిలదొక్కుకోవడం కష్టమే.

 

ఇక గత ఏడాది 118తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ తాజాగా ఎంత మంచివాడవురా తో మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా , శ్రీదేవి మూవీస్ అధినేత శివ లెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు.తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి వాడవురా డే 1 కలెక్షన్స్ :

నైజాం - 0.60 కోట్లు సీడెడ్ - 0.37 కోట్లు ఉత్తరాంద్ర - 0.18 కోట్లు గుంటూరు -0.19 కోట్లు తూర్పు గోదావరి - 0.29 కోట్లు పశ్చిమ గోదావరి - 0.20 కోట్లు ' కృష్ణా - 0.19 కోట్లు నెల్లూరు - 0.08 కోట్లు మొత్తం మొదటి రోజు గాను షేర్ 2.10కోట్లు ఇంకా పెరిగేలా ఉన్నాయని ఆలోచన లు సాగుతున్నాయి..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: