వెండితెరమీదే కాదు బుల్లితెరమీద కూడా ప్రేమ పక్షులు విహరిస్తున్నాయి. ఇలాంటి వారిలో రాహుల్‌ సిప్లిగంజ్‌-పునర్నవి భూపాలం లను చెప్పుకోవచ్చూ. సినిమాలోని కధలా మొదలైన వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లుతుందనే వార్తలు ఆ మద్య కాలంలోనే గాక ఇప్పటికి కూడా చక్కర్లు కొడుతున్నాయి.. ఇకపోతే నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ 3 కోసం ఒకే ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారిందని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.

 

 

ఇక బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరి మద్య సాన్నిత్యం ఇలాగే కొనసాగుతుందట. ఇకపోతే షోలో ఒకరికి ఒకరు చేసుకున్న త్యాగాలు చూస్తే పెళ్లైన దంపతులు కూడా ఇంతలా అన్యోన్యంగా ఉండరేమో అనిపిస్తుంది. ఇదే కాకుండా షో సమయంలో నాగార్జున కూడా వీరిద్దరి విషయంలో సరదాగా వీరితో ఒక ఆటాడుకున్నాడు. అయితే ఈ షో తరువాత బిజీ అయిపోయిన వీరిద్దరూ తమ కెరీర్ పై దృష్టి సారించారు. కాగా అప్పట్లో తనను విన్నర్‌గా గెలిచిపించిన అభిమానుల కోసం తాను, పునర్నవి కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని ప్రకటించిన రాహుల్. ప్రస్తుతం ఆ ఆల్బమ్ పర్మిషన్ గురించి పునర్నవి పేరెంట్స్ ను కలిసినట్టు తెలిపాడు.

 

 

ఈ ఆల్బమ్ లో పునర్నవి నటించబోతోన్నట్లు తెలుస్తోంది. బేబీ అంటూ సాగే ఒక సాంగ్ కు శాంపిల్ రిథమ్ కంపోసింగ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అదీ గాకుండా ప్రస్తుతం రాహుల్ కెరీర్ పీక్స్‌లో ఉంది. అటు సింగర్ గానే కాకుండా నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో రాహుల్ అవకాశం పట్టేసాడు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో రాహుల్‌ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు.

 

 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఓ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలో రాహుల్‌తోపాటు పునర్నవి కూడా పాల్గొంది. అంతేకాదండోయ్‌ వీరిద్దరూ ఈ సినిమాలోని ఒక పాట పాడుతూ డ్యాన్స్‌ కూడా చేసారు. మొత్తానికి వీరి ప్రేమ కధ  బాహుబలి లోని కట్టప్ప కధలా సాగుతుంది. మరి ఈ కధకు ముగింపు ఎప్పుడు పలుకుతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: