రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన గత సినిమా 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాగా నిరాశపరచడంతో అల్లు అర్జున్ సినిమాల నుండి కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో తనని తాను బాగా అనలైజ్ చేసుకున్నాడు. ఇకపై ఎలాంటి కథలని ఎంచుకోవాలి, ఎలాంటి డైరెక్టర్స్ తో పనిచేయాలని బాగా ఆలోచించుకున్నాడు. దాని వల్ల సహజంగా గ్యాప్ వచ్చింది. అయితే బన్ని గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది అన్నారు. అయితే గ్యాప్ వచ్చినప్పటికీ  తన తాజా సినిమా 'అల వైకుంఠపురములో' రిజల్ట్ విషయంలో అల్లు అర్జున్ చాలా సంతోషంగా ఉన్నారు. 'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

 

అల్లు అర్జున్ తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకూ గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచే పని చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈమధ్యే కొత్త ఆఫీస్ తీసుకున్నారు. తనకంటూ ప్రత్యేకంగా ఒక ఆఫీస్ తీసుకోవడంతో ఇకపై అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ లో తన సినిమాలు చేయరేమోనని ఒక వర్గం జనాలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు. ఇప్పటి నుంచి తన సొంత బ్యానర్లోనే సినిమాలు చేస్తారని కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక కొందరైతే ఇంకా రెండడుగులు ముందుకు వేసి నాన్నగారు అరవింద్ తో కూడా బన్ని కి అభిప్రాయ భేదాలు వచ్చాయని అన్నారట. ఈ విషయంపై అల్లు అర్జున్ సిపుల్ గా అవన్ని వట్టి మాటలని నవ్వేసి ఊరుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నారని దాంతో ఆయా సినిమాల టీమ్స్ ఒకే ఆఫీస్ లో ఇరవై నాలుగు గంటలూ పని చేస్తూ ఉండడంతో స్పేస్ సరిపోవడం లేదని.. తనకు ప్రైవసీ ఉండడం లేదని అన్నాడు బన్నీ. అందుకే సొంత ఆఫీస్ తీసుకున్నాను తప్ప ప్రత్యేకంగా వేరే ఇతర కారణాలు లేవని క్లారిటి ఇచ్చాడు. 

 

ఇక అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని.. ఈ సినిమాలో అల్లు అర్జున్ మొదటిసారి ఊర మాస్ గెటప్ లో.. రగ్డ్ లుక్ లో కనిపిస్తారని అంటున్నారు. 'రంగస్థలం' తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఒక రకంగా 'రంగస్థలం' లో చరణ్ ని కూడా ఊర మాస్ గెటప్ లో.. రగ్డ్ లుక్ లో చూసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సుకుమార్. ఇక గతంలో బన్ని సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వచ్చిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: