సిటీలో క్యాబ్ లో వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు.. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఈ సర్వీసులను ఎక్కువగా వాడుతుంటారు.. అందుకే సిటీలో ఈ క్యాబ్ లు కూడా ఎక్కువగా దర్శనమిస్తుంటాయి..అయితే ఇది కేవలం సాధారణ వ్యక్తులు మాత్రమే ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటారు.. కానీ సినీ సెలెబ్రెటీలు కూడా ఈ క్యాబ్ లను వాడుతున్నరట.. 

 

అయితే బాలీవుడ్ బ్యూటీ ఒకరు ఉబర్ క్యాబ్ లో ప్రయనంచేసిందట.. ఆమె ఎక్స్పీరియన్స్ గురించి అందరికీ చెప్పింది.. అయితే ఎవరంటే .. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ యూబర్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంది. గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా వెల్లడించింది. తరచూ లండన్‌కు వెళ్లి వస్తుండే ఆమె ఇలా.. 'హే. నాకు యూబర్ లండన్‌లో భయంకరమైన అనుభవం ఎదురైంది. ప్లీజ్ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. లోకల్ ట్యాక్సీ ఎంచుకోవడం బెస్ట్ అండ్ సేఫెస్ట్ ప్లేస్. నాకైతే వణుకు పుట్టింది'

 

 

'ఆ డ్రైవర్ కుదురుగా లేడు. గట్టిగా అరుస్తూ కేకలు పెడుతున్నాడు. ఎక్కి దిగేంత వరకూ భయపడుతూనే ఉన్నా'అని ట్వీట్ చేసింది. దానికి యూబర్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. తన కాంటాక్ట్ డిటైల్స్ కావాలని అడిగింది. 'నేను మీ యాప్‌లో కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించాలనుకున్నాను. కానీ, రోబోట్‌ల వల్ల పలుమార్లు నా చాట్ తొలగించేశాయి. ముందు మీ సిస్టమ్ అప్‌డేట్ చేస్కోండి. డ్యామేజ్ ఇప్పటికే అయిపోయింది. అంతకుమించి మీరేం చేయలేరు' అని సమాధానమిచ్చింది. 

 

సోనమ్ కపూర్ ఒక్కరే కాదు.. ఆమె ట్వీట్‌ను తన భరత్ ఆనంద్ అహుజా కూడా రీ ట్వీట్ చేశారు. లండన్‌లోని ప్రతి ఒక్కరినీ యూబర్ లో ప్రయాణించొద్దంటూ హెచ్చరించాడు. 'ప్లీజ్ యూబర్ వాడొద్దు. ప్రత్యేకంగా లండన్ లో. మేం పూర్తిగా ఆపేశాం. నడిచి, బైక్, ట్రైన్/బస్ లేదా లండన్ బ్లాక్ క్యాబ్స్ కు వెళుతున్నాం. ఇవే సేఫ్.. కొంచెం విచక్షణంగా ఉండేవి' అని భార్యకు వంత పలికాడు. ఆమె భర్త మాట వింటుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: