సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదల అయినా ‘అల వైకుంఠపురములో’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నాపేరు సూర్య అలాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా దొరకడంతో ఓవర్సీస్ లో కళ్ళు చెదిరే కలెక్షన్లు కొల్లగొట్టింది.

 

అయితే సినిమాలో పెద్ద విషయమేమీ లేదని త్రివిక్రమ్ సినిమాలు అన్ని ఏవిధంగా ఉంటాయో ఆ విధంగానే ‘అల వైకుంఠపురములో’ ఉందని అయితే సినిమాకి హైలైట్ ఏమిటంటే..సినిమాలో ఒక సీన్ లో...టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సాంగులకు డాన్స్ మరియు స్టెప్పులు వేసే ఎపిసోడ్ సన్నివేశం సినిమాకే హైలెట్ అని...ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాటకు 'వచ్చాడయ్యో స్వామీ'కి బన్నీ స్టెప్పులేయడం ఎవరు ఊహించలేదని... ఆ తర్వాత 'ఐ వానా ఫాలో ఫాలో..' అంటూ 'నాన్నకు ప్రేమతో' పాటకు తారక్ తరహాలోనే స్టెప్పులేస్తాడు.

 

తర్వాత 'ఉండిపోరాదే..' పాట వస్తుంది. ఆపై సునీల్ లైన్లోకి వచ్చి ఇన్ని పాటలకు స్టెప్పులేశావ్..  మా పవన్ కళ్యాణ్ పాటకు వెయ్యవా అని అడిగితే.. 'గబ్బర్ సింగ్'లోని పిల్లా నువ్వు లేని జీవితం పాటకు అచ్చం పవన్‌లాగా అల్లు అర్జున్ స్టెప్పులేయడం ఆ తర్వాత ఆ సాంగ్స్ అన్నిటికీ డాన్స్ వేసిన తర్వాత సినిమాలో విలన్ ని ఒక దెబ్బ కొట్టి 'అబ్బనీ తీయని దెబ్బ' పాటకు స్టెప్ వేసి పెద్దాయన పాట లేకుంటే ఎట్లా అంటూ ఆ ఎపిసోడ్‌కు అదిరిపోయే కలరింగ్ అల్లుఅర్జున్ తీసుకురావడంతో సినిమా మొత్తానికి అదే హైలెట్ అని...ఆ సన్నివేశం ఉండటం వల్లే అన్ని సినిమాల హీరోల అభిమానులు వస్తున్నారని లేకపోతే ‘అల వైకుంఠపురములో’ థియేటర్ ల లోంచి ఎప్పుడో సర్దుకుపోయే టైం వచ్చేదని సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. 'అల వైకుంఠపురములో' సినిమాతో పోలిస్తే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు చాలా బాగుంటాయని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: