గంగోత్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయిన హీరో మెగా అల్లుడు అల్లు అర్జున్..ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆతర్వాత ఆర్య సినిమాలో నటించాడు.. ఆ సినిమా హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ కొట్టిన బన్నీ మాత్రం బన్నీ,హ్యాపీ వంటి సినిమాలలో కూడా నటించారు..తన స్టయిల్ తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు.. 

 

ప్రేక్షకులు ఒకరికి బాగా కనెక్ట్ అవ్వడం అంటే అతనిలో ఏదోకటి నచ్చితే వాటికి మంచి మార్కులు వేయడం చేస్తారు. అంతేకాకుండా అభిమానులుగా మారుతుంటారు.. అందుకే సినిమాలను చూసి చాలా మంది నేర్చుకుంటారు.. ఆ అభిమానమే కొందరికి క్యాష్ ఫుల్ క్లాష్ వస్తుంటాయి.. అలా అల్లు అర్జున్ కాస్త బన్నీ గా మారాడు. అందరూ అతగాడిని బన్నీ అని పిలుస్తారు.. 

 

ఇకపోతే బన్నీ సినీ కెరియర్ ఈ మధ్య కాస్త నత్తనడక గా సాగుతుంది.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురం లో సినిమాలో నటించారు.. ఈసినిమాలో బన్నీ యాక్టింగ్ నచ్చడంతో సినిమా సూపర్ హిట్ అయింది..సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోయింది.. 

 

ఇది ఇలా ఉండగా ఈ సినిమా లోని ట్రెయిలర్ లో  మేక వచ్చింది పులి వచ్చింది అంటూ సాగిన డైలాగుని ఓ వ్యక్తి చెప్పిన సంగతి తెలిసిందే.. కాగా అతను చేసిన పాత్ర చిన్నదే అయినా కూడా మంచి గుర్తిపును తెచ్చుకున్నాడు.. నిజానికి అతను బన్నీ బాడీ గార్డ్ అట.. నటన మీద ఇంట్రెస్ట్ ఉండటంతో బన్నీ ఓ ఛాన్స్ ఇప్పిచాడట.. తోటివారిని ప్రోత్సహించడంలో బన్నీ భళా అనే చెప్పాలి.. మొత్తానికి రియల్ లైఫ్ లో కూడా బన్నీ స్టార్ అవ్వడమే కాదు అందరి చేత శభాస్ అనిపించుకున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: