స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల ..  వైకుంఠపురములో  ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ లో కూడా  ప్రభంజనం సృష్టిస్తుంది. 4రోజుల్లో ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా 71.54 కోట్ల షేర్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ లో  84శాతం రికవరీ చేసింది. రేపటి తో ఈ  సినిమా చాలా ఏరియాల్లోబ్రేక్ ఈవెన్  కానుంది. ఇక ఫుల్ రన్ లో ఈ చిత్రం 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లోనైతే 4వరోజు కూడా థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీ తో రన్ అయ్యింది. ఈరోజు కూడా అన్ని థియేటర్లలో ఇదే పరిస్థితి వుంది. దాంతో 5వరోజు  9కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలు వున్నాయి. ఇక ఈ చిత్రంతో  సరైనోడు తరువాత ఎట్టకేలకు  అల్లు అర్జున్ మరో  బ్లాక్  బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. 
 
అల... వైకుంఠపురములో ప్రపంచ వ్యాప్తంగా  4రోజుల వసూళ్ల వివరాలు : 
 
నైజాం -17.3 కోట్లు 
సీడెడ్ - 8.35 కోట్లు 
ఉత్తరాంద్ర - 8.3 కోట్లు 
గుంటూరు -5.91 కోట్లు 
తూర్పు గోదావరి - 4.6 కోట్లు 
పశ్చిమ గోదావరి - 4. 36 కోట్లు '
కృష్ణా - 4.03 కోట్లు 
నెల్లూరు - 2. 04 కోట్లు 
తెలు గు రాష్ట్రాల్లో మొత్తం 4రోజులకు గాను షేర్ =54.89 కోట్లు 
రెస్ట్ ఆఫ్  ఇండియా - 7.65 కోట్లు 
ఓవర్సీస్ - 9కోట్లు 
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా  4రోజులకు గాను షేర్ =71.54 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: