సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సంపాదించుకున్న తర్వాత వారు ఖాళీగా ఉండకుండా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటారు. అదే అమ్మ, అక్క, వదిన, అత్త పాత్రలు.. అయితే ఈ పాత్రల్లో కూడా వారి చేతికి అందే రెమ్యునరేషన్ ఏం తక్కువ కాదు. ఇందుకు గాను భారీ మొత్తంలోనే పుచ్చుకునే తారలు ఉన్నారు. ఇకపోతే వీరు చేసే పాత్రలు పేరుకే అమ్మ, అక్క, వదిన, అత్త లాంటివి కాని ఇందులో ఉన్న హీరోయిన్ అందానికేమి తీసిపోని విధంగా గ్లామర్‌గా కనిపిస్తారు..

 

 

ఇకపోతే టాలీవుడ్‌లో హీరోయిన్ల తరువాత తల్లుల పాత్రల మీదే ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది. ఇక తల్లుల పాత్రల్లో  రిచ్‌గా కనిపించే కొందరు తల్లుల రెమ్యునరేషన్ల గురించి తెలిస్తే, ఆశ్చర్యమనిపిస్తుంది.. మరి ఆ వివరాలు చూద్దాం. మొదటగా రమ్యకృష్ణ ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ హీరోయిన్. దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నా, తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది.

 

 

కాగా బాహుబలితో ఆమె బ్రాండ్ సౌత్ లో గట్టిగా పెరిగింది. ఇక ప్రస్తుతం రోజుకు మూడు నుండి ఆరులక్షల వరకు తీసుకుంటుందని వినికిడి.. ఇకపోతే అందమైన అత్త, అమ్మ క్యారెక్టర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన నదియా 2 నుంచి 3 లక్షల వరకు డైలీ పేమెంట్ తీసుకుంటారట. ఇక చాలా సంవత్సరాల తరువాత బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని ‘గౌతమీ పుత్రశాతకర్ణి’లో రాజమాతగా టాలీవుడ్‌లో దర్శనమిచ్చింది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు ఆమె కోటిన్నర నుంచి 2 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు టాక్..

 

 

ఇక సహజ నటి అనే బిరుదును సొంతం చేసుకున్న ఒకప్పటి హీరోయిన్‌, జయసుధ, అమ్మ, నాయనమ్మ పాత్రలకు బెస్ట్‌ ఛాయిస్‌గా నిలిచింది. ఇందుకు గాను పది నుంచి పన్నెండు రోజుల షూటింగ్‌ ఉంటే రోజుకు 2 లక్షలు... ఆ పైన ఒక్కో రోజు అదనంగా ఉన్నా లక్ష ఎక్కువగా తీసుకుంటారట. ఇక మరోనటి రేవతి హీరోయిన్‌గా తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి హీరోయిన్‌ అని పేరు తెచ్చుకుంది. మిగతా అమ్మల మాదిరిగా రోజుకి ఇంత అని కాకుండా సినిమాకి 20 నుంచి 25 లక్షలు తీసుకుంటుందట..

 

 

పెద్దరికంగా కనిపించే పాత్రలకు కేరాఫ్‌గా మారిన పవిత్ర, రోజుకి 50 నుంచి 60 వేలు తీసుకుంటుండగా, తమిళ యాక్టర్ తులసి. రోజుకి 35 వేల నుంచి 40 వేలు  డైలీ పేమెంట్ వసూలు చేసుకుంటుందట... రాశి రోజుకు 75వేల రూపాయల వరకు తీసుకోగా, మళయాళి అమ్మ రోహిణి రోజుకి 50 నుంచి 60 వేల చొప్పున తీసుకుంటుందని టాక్. ఇకపోతే రోజుకు మధుబాల - 50 నుంచి 60 వేలు, సుధా - 35 వేలు,  శరణ్య పొన్నన్ 40నుంచి 50 వేలు, హేమ - 40 నుంచి 50 వేలు, ప్రగత్య 30 నుండి 50 వేల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: