టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో చాలా తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించాలని ప్రయత్నాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు మరియు డైరెక్టర్లు వ్యవహరించిన తీరుపై బహిరంగంగానే మీడియా ముందు విమర్శలు చేయడం జరిగింది. కావాలనే ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు మరియు డైరెక్టర్లు తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా రాణించడం లేదని అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తున్నారు అని హీరోయిన్ ఛాన్స్ కోసం వచ్చిన తెలుగు అమ్మాయిల చేత అసభ్యకరమైన పనులు చేయించుకుంటున్నారని కాస్టింగ్ కౌచ్ ఉందని అనేకమంది మీడియా ముందే విమర్శలు చేసిన సంఘటనలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అయితే ఎంత మంది ఎన్ని విధాల ఆరోపణలు చేసినా గాని ఇండస్ట్రీలో మాత్రం పరభాషా అమ్మాయిలకు మాత్రమే పెద్దపీట వేస్తున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు, నిర్మాతలు.

 

కనీసం తెలుగు అమ్మాయిలను పట్టించుకోకుండా దర్శక నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి అయినా హీరోయిన్ అంజలి టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించిన తర్వాత ఇక్కడ డైరెక్టర్లు అంతా అంజలిని లైట్ తీసుకోవటంతో వెంటనే అంజలి కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకొని ఇప్పుడు అక్కడ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది.

 

ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ చెందిన దర్శకులు మరియు నిర్మాతలు ప్రాంతీయ అభిమానంతో ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిలకు మొదటిగా అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళ విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటారు...కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధంగా తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయిలను ….హీరోయిన్లుగా తీసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదని కనీసం వారికి విలువ ఇవ్వటం లేదని స్థానం కూడా ఇవ్వటం లేదు తెలుగు అమ్మాయిల అంటే కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్ల దృష్టిలో క్యారెక్టర్ ఆర్టిస్టులు గానే మిగిలిపోతున్నారు అంటూ విమర్శలు ఈమధ్య ఎక్కువయ్యాయి. హీరోయిన్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ముంబైకి చెందిన అమ్మాయి వేరే ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను గాని మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్లు తీసుకుంటున్నారని తెలుగు అమ్మాయిల టాలెంట్ తొక్కేస్తున్నది టాలీవుడ్ డైరెక్టర్ లే అంటూ మండిపడుతున్నారు చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కోసం అవకాశాలు చాలా ప్రయత్నాలు చేసిన తెలుగు అమ్మాయిలు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: