మాస్ మహారాజా రవితేజ హీరోగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైఫై యాక్షన్ ఫిలిం 'డిస్కోరాజా'. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇక గ్రాండ్ గా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు టీజర్లు.. రెండు పాటలు రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇవి ఇపటికే మాస్ రాజా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి 'రమ్ పమ్ బమ్' అంటూ సాగే డిస్కో స్టైల్ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం.

 

'డిస్కోరాజా' సినిమాకి సంగీత దర్శకుడు తమన్. మాంచి ఫాం లో తమన్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు . మాస్ మహారాజా రవితేజ.. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి..సింగర్ శ్రీకృష్ణ పాడారు. "కాలం ఆగాలి నా కాలి వేగం చూసి లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి కొండలే ఊగి పోవాలి నా జోరుకి.. దిక్కులే పారిపోవాలి నా హోరుకి" అంటూ సింపుల్ పదాలతో సాగింది ఈ పాట సాహిత్యం. పాత బప్పీ లహరి పాటల స్టైల్ ను కొంచెం గుర్తు తెస్తూనే ఈతరం ఇన్ స్ట్రుమెంటేషన్ తో థమన్ సూపర్ ట్యూన్ కంపోజ్ చేసి మంచి సాంగ్ ని మాస్ ఫ్యాన్స్ కోసం సిద్దం చేశాడు. ఇక రవి తేజ పాట మధ్యలో "ఆఆ.. రమ్ ప బమ్ రబరిబ" అంటూ చేసిన హమ్మింగ్ పాటకు హైలైట్ గా నిలిచింది.  

 

డిస్కో పాటకు ఈ హమ్మింగే సగం హైప్ ని తీసుకొస్తుంది. అసలే సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ పాటతో కూడా తన ఫామ్ ని ఇంకా కంటిన్యూ చేశాడు. మాస్ ఆడియన్స్ కు వెంటనే కనెక్ట్ అవుతూ అందరికీ నచ్చేలా థమన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేశాడు.  ఇక ఈ సాంగ్ వీడియో కూడా ఆసక్తికరంగా ఉండటం విశేషం. రవితేజ యాక్షన్ గెటప్ మాత్రమే కాకుండా.. చివరి సీన్ లో సునీల్ బ్యాచ్ అంతా రెట్రో స్టైల్ లో ఒక బార్ లో డ్యాన్స్ చేస్తూ ఉండడంతో సాంగ్ బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక థమన్ రవి తేజ కాంబినేషన్ లో మిరపకాయ్, బలుపు వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: