ఈ మధ్యాకాలంలో కొత్త కొత్త సినిమాలు అన్ని టీవీలలో చాలా త్వరగా వచ్చేస్తున్నాయి.. టీవీలలో అన్న బెటర్.. కనీసం రెండు నెలలకు లేదా నెలకు అయినా వస్తాయి.. కానీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిలో అయితే నెల రోజులలోనే వచ్చేస్తాయి. అదేం అంటే మేము కొనుకున్నాము.. మా ఇష్టం అంటాయి. 

 

ఇంకా అవి అంటే ఆన్లైన్ కాబట్టి సరిపోయింది. కానీ బుల్లితెరపైన కొత్త కొత్త సినిమాలు అన్ని వచ్చేస్తున్నాయి. స్టార్ మా ఛానెల్ లో సుత్తి సీరియల్స్ తో టిఆర్పి తెచ్చుకుంటుంది.. జెమినీ టీవీ కొత్త కొత్త సినిమాలు వేసి టిఆర్పి తెచ్చుకుంటుంది. మన తెలుగులో ఉన్న ఎంటర్టైనింగ్ ఛానెల్స్ ఈ మధ్యకాలంలో అదరగొడుతున్నాయి. 

 

ఒకప్పుడు.. అన్ని ప్లాప్ సినిమాలను జెమినీ టీవీ తీసుకునేది.. హిట్ సినిమాలను స్టార్ మా తీసుకునేది. స్టార్ మా ఎప్పుడు అతడు.. పోకిరి.. మగధీర వంటి సినిమాలు వేసి సతాయిస్తే.. జెమినీ టీవీ డాడీ.. సమరసింహా రెడ్డి.. ఇంద్ర అని 2000 సినిమాలు వేసి బుల్లితెర ప్రేక్షకుల మెదడుని తినేవారు.. 

 

ఇవి రెండు అయినా 2000 తర్వాత సినిమాలతో తలా తినేవారు.. కానీ ఇంకా ఈటివి అయితే అబ్బో వద్దులే.. 1990లో పాత సినిమాలను వేసి ప్రేక్షకుల మైండ్ ను బ్లాక్ చేసేవాళ్ళు. సరే ఇంకా వాళ్ళ గురించి వదిలేస్తే.. ఇన్నాళ్లు టిఆర్పి లేక పోయిన పర్వాలేదు.. మనం ఏదో ఒకటి నడిపేద్దాం అనుకున్న జెమినీ ఈ మధ్య కొత్త కొత్త సినిమాలను కొని వారి టీవీలో వేసుకుంటున్నారు. 

 

గత కొన్ని వారాల నుంచి జెమినీ ఛానెల్ సరికొత్త చిత్రాలను టెలికాస్ట్ చేసి ప్రేక్షకులను అలరిస్తుంది. అలా నిన్న సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ''సైరా నరసింహా రెడ్డి'' చిత్రం మెగా ప్రీమియర్ గా టెలికాస్ట్ చేసారు. ఇప్పుడు అదే ఊపులో వచ్చే ఆదివారం ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ''విజిల్"ను టెలికాస్ట్ చెయ్యబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: