సాధారణంగా మన స్టార్ హీరోలని గాని హీరోయిన్స్ గాని దర్శకులు ఇంట్రడ్యూస్ చేయాలంటే దానికోసం ప్రత్యేకంగా ఒక సీన్ గాని సందర్భాన్ని గాని క్రియోట్ చేసి తెరకెక్కిస్తుంటారు. పూరి జగన్నాధ్, బోయపాటి లాంటి వాళ్ళు హీరో ఇంట్రడక్షన్ ఫైట్ తోనో సాంగ్ తోనో ఇస్తారు. ఇక హీరోయిన్ విషయంలో కూడా అంతే. ఒక అందమైన సీన్ తో హీరోయిన్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. కానీ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇందులో చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఆయన హీరో ఇంట్రడక్షన్ కి ఇచ్చే బిల్డప్ గొప్పగా ఉంటుంది. హీరోయిన్ విషయంలోను అంతే. 

 

క్యూట్ గా ఫన్నీగా ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు రొమాంటిక్ గా పరిచయం చేస్తుంటారు. ఇక గత కొంత కాలంగా గురూజీ ఎదుర్కొంటున్న విమర్శలకు ఒక్కసారిగా సైలెంట్ గా ఉండే ఫుల్ స్టాప్ పెట్టారు. తన మార్క్ ను చూపిస్తూ అద్బుతమైన ఎంటర్ టైన్మెంట్ ను మళ్ళీ ఇచ్చారంటూ అభిమానులు సంబరపడుతున్నారు. అల వైకుంఠపురంలో సినిమాతో త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటూ చాలా మంది ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల వైకుంఠపురంలో ప్రతి సీన్, ప్రతి పాట, ఫైట్ ఇలా అన్ని కూడా చాలా ప్రత్యేకంగా చాలా విభిన్నంగా గురూజి ప్లాన్ చేశారు. ఇవి 'అల' లో అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి సగం ఇవే కారణమయ్యాయి అంటున్నారు.

 

ముఖ్యంగా 'సిత్తరాల సిరపడు' పాటకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాటలో ఫైట్ పెట్టడం ఒక్క త్రివిక్రమ్ గారికే సాధ్యమైందని చెప్పుకుంటున్నారు. అసలు ఇలాంటి భయంకరమైన ఐడియాలు మీకు ఎలా వస్తాయండి ..! అంటూ సరదాగా త్రివిక్రమ్ ను చాలా మంది అడుగుతున్నారట. పాటలో ఫైట్ పెట్టాలనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని అలాంటి కొత్త కాన్సెప్ట్ లను ప్రయత్నించాలంటే చాలా ఘట్స్ ఉండాలంటూ విమర్శకులు కూడా కాస్త షాకవుతూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

మాటల మాంత్రికుడు గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న విమర్శలన్నింటికి ఈ సినిమాతో ఫుల్ స్టాప్ పెట్టారు. ఒక అద్బుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడంటూ అభిమానులు చాలా సంతోషంగా చెబుతున్నారు. సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతి విజేతగా నిలిచిందని మెగా అభిమానులతో పాటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్  తన నెక్స్ట్ సినిమాని తారక్ తో తీయబోతున్నారని చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: