తెలుగు సినిమాలకు యూఎస్ మార్కెట్ ఎంత ప్రధానంగా మారిందో తెలిసిందే. ప్రస్తుతం సంక్రాంతి సీజన్లో యూఎస్ మార్కెట్లో కూడా బన్నీ, మహేశ్ మధ్య మంచి పోటీ నడుస్తోంది. బన్నీ అల.. వైకుంఠపురములో సినిమా అక్కడ సత్తా చాటుతోంది. మరొక్క రోజులో బ్రేక్ ఈవెన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలినదంతా లాభమే. అంతలా బన్నీ సినిమా దూసుకుపోతోంది. దీనికి త్రివిక్రమ్ మార్కెట్ కూడా తోడై సినిమాను సేఫ్ జోన్ నుంచి ప్రాఫిట్ జోన్ లో వేస్తోంది.

 

 

మరోవైపు మహేశ్ సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్స్ లో బాగానా వసూలు చేసినా రెగ్యులర్ రన్ లో వెనుకబడింది. బుధవారం 164 లొకేషన్లలో భారీ డ్రాప్స్ కనిపించాయి. దీనికి విరుద్ధంగా బన్నీ అల.. మాత్రం దూసుకుపోతోంది. బుధవారం కూడా 147 లొకేషన్లలో ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. దీంతో బ్రేక్ ఈవెన్ ఖాయంగా కనిపిస్తోంది. 2మిలియన్ల బిజినెస్ జరిగిన అల.. అప్పుడే 1.8 మిలియన్లు వసూలు చేసింది. దీంతో మరికొద్ది రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోబోతోంది. మహేశ్ సరిలేరు.. అక్కడ 3మిలియన్ల బిజినెస్ జరిగింది. కానీ ఇంకా 1.5 మిలియన్ల దగ్గరే ఉంది. ఈ సిననిమా ఫుల్ రన్ లో 2 మిలియన్ల వద్దే ఆగిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

 

ఓవర్సీస్ లో టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు తెచ్చేది హీరోల్లో మహేశ్ బాబు ముందుంటాడు. కానీ ఈమధ్య మహేశ్ కు ఓవర్సీస్ వర్కౌట్ కావట్లేదు. మహర్షి కూడా అక్కడ లాస్ వెంచర్ గానే ఉండిపోయింది. తెలుగులో బాగానే వచ్చినా యూఎస్ లో దెబ్బతింది. పూర్తి కలెక్షన్లు మరికొద్ది రోజుల్లో తేలనున్నాయి. అక్కడ వచ్చే కలెక్షన్లు నిర్మాతలకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే అక్కడ మంచి బిజినెస్ జరిగితే నిర్మాత కొంత సేఫ్ అయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: