శర్వానంద్ తో తీసిన శతమానంభవతి సినిమాతో సూపర్ హిట్ కొట్టి, మంచి కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించాడు యువ దర్శకుడు సతీష్ వేగేశ్న. దిల్ రాజు నిర్మించిన ఆ సినిమాకు ఉత్తమ కుటుంబకథా చిత్రంగా జాతీయ అవార్డు కూడా లభించింది. అయితే ఆ తరువాత నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం సినిమా తీసిన సతీష్, ఆ సినిమాలో పెళ్లి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రస్తుత తరం వారు మరిచిపోతున్నారని, అందువలన మన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పెళ్లి తంతుని కళ్ళకు కట్టినట్లు చూపిన సతీష్ వేగేశ్న, ఆ సినిమాతో మాత్రం ఫ్లాప్ ని చవి చూసాడు. 

 

ఇక ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎంత మంచివాడవురా సినిమాను తీసిన సతీష్, నా అనే వారు ఎవరూ లేక ఆనాధైన ఒక యువకుడు, తనకు మాదిరిగా మరొకరు ఆ విధంగా అనాధలవలె జీవించకూడదని భావించి, ఎమోషన్స్ సప్లై చేసే కంపెనీ ఒకటి పెడతాడు. నిజానికి ఇప్పుడు ఇదే పాయింట్ గురించి కొందరు ప్రేక్షకులు దర్శకుడు సతీష్ పై విమర్శలు చేస్తున్నారు. కథ పరంగా ఈ సినిమా కోసం మంచి పాయింట్ ని ఎంచుకున్న సతీష్, దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో చాలా చోట్ల చతికిలపడ్డారని, ఇక తన గత సినిమా శ్రీనివాస కల్యాణంలో కొంత ఫోర్స్డ్ గా ట్రెడిషనల్ సీన్స్ ని ప్రేక్షకులపై రుద్దిన దర్శకుడు, ఈ సినిమా ద్వారా ఫోర్స్డ్ ఎమోషన్స్ ని చూపించడం జరిగిందని, 

 

అలానే సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేకపోగా చాలా చోట్ల బోరింగ్ గా సాగి, తమ సహనానికి పరీక్ష పెడుతుందని అంటున్నారు. ఇక హీరోగా నటించిన కళ్యాణ్ రామ్ బాగా నటించారని, అలానే హీరోయిన్ సహా మిగతా పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు బాగానే నటించినట్లు చెప్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒకింత కేవలం పర్వాలేదనిపించే టాక్ తో ముందుకు సాగుతోంది. సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో సినిమాకు ఒకింత బాగానే కలెక్షన్స్ వస్తున్నాయని, ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కొల్లగొడుతుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: