సరైన సినిమా పడితే అల్లు అర్జున్ స్థాయి ఏంటో తెలుస్తుందనడానికి అల.. వైకుంఠపురములో సినిమా ప్రత్యక్ష ఉదాహరణ. అల.. సాధిస్తున్న కలెక్షన్లతో బన్నీ ఇదే నిరూపిస్తున్నాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మహేశ్ సరిలేరు నీకెవ్వరును వెనక్కు నెట్టి మరీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాలుగో రోజు కలెక్షన్లలో నైజాం, సీడెడ్, వైజాగ్, కృష్ణా, వెస్ట్, గుంటూరు, నెల్లూరుల్లో బన్నీ నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేశాడంటే అల.. ఉధృతి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

 

బన్నీకి గతంలో సూపర్ హిట్స్ ఉన్నా భారీ బ్లాక్ బస్టర్ లేదనే చెప్పాలి. ఏమాత్రం డివైడ్ టాక్ లేకుండా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన బన్నీ సినిమా అల.. వైకుంఠపురములో. ఆరోజు మొదలైన బన్నీ ఇప్పటికీ ఆగట్లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా భీభత్సం చేసేస్తున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయిపోతే యూఎస్ లో మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి మూడు మిలియన్ల దిశగా దూసుకుపోతున్నాడు. అక్కడ అల.. భారీ కలెక్షన్లు సాధిస్తోంది. నార్మల్ సీజన్లో ఈ సినిమా పడుంటే మరింతగా దద్దరిల్లిపోయేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

 

బన్నీ వన్ మ్యాన్ షో, త్రివిక్రమ్ మార్క్ మేకింగ్, డైలాగ్స్ తో పాటు తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోశాయి. గుంటూరులో నార్మల్ ధియేటర్ వెంకటకృష్ణలో బ్లాక్ టికెట్లు అమ్మేంతగా అల.. దూసుకుపోతోంది. హైదరాబాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో నేడు 5 ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. యూఎస్ లో ధియేటర్లు పెంచారు. ఇలా ఎక్కడ చూసినా బన్నీ హవా సాగిపోతోంది. ఈ వారాంతానికి భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: