నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్ లో ఓ మంచి పేరు ఉన్నది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో  ఆయనకు ఆయనే సాటి.  ఎవరూ లేరు పోటీ.  అలాంటి బాలయ్య గత కొంతకాలంగా సక్సెస్ కోసం వెంపర్లాడుతున్నాడు.  మాస్ సినిమాలు చేయాలనీ చూసి బోల్తా కొడుతున్నాడు. బోల్తా పడటమే కాదు, నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు.  తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీసి చేతులు కాల్చుకున్నాడు.  సినిమా చప్పగా ఉండటంతో దారుణంగా ఫెయిల్ అయ్యింది.  


రెండు సినిమాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీశారు.  ఇదే దెబ్బకొట్టింది.  బయోపిక్ సినిమా అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి.  కానీ, ఈ సినిమాలో ఉన్నది చూపించకుండా లేనిది చూపించి మెప్పించాలని చూశారు.  అదే సినిమాకు దెబ్బకొట్టింది. 100 వ సినిమా శాతకర్ణి తరువాత బాలయ్యకు మంచి హిట్ లేదు.  మధ్యలో చేసిన జైసింహ కాస్త పర్వాలేదనిపించింది.  రీసెంట్ గా తీసిన రూలర్ సినిమా అడ్రస్ లేకుండా పోయింది.  


ఇప్పుడు బాలయ్య బోయపాటితో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.  కాశీ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా తెరకెక్కబోతుంది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.  ఇది మూడో సినిమాసినిమా విజయవంతమైతే, ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాలే విజయాలు సాధిస్తాయని అంచనాలకు రావాల్సి ఉంటుంది.  


ఇకపోతే, ఈ సినిమాను బాలయ్య సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.  సమ్మర్లో అనేక సినిమాలు రాబోతున్నాయి.  అందులో మెగాస్టార్ సినిమా కూడా ఉన్నది.  ఈ రెండు సినిమాలు ఒకేరోజున వస్తే మరలా పాత ఫైట్ తెరమీదకు వచ్చినట్టే అవుతుంది.  మరి బాలయ్య సినిమా ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగవల్సిందే. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య బి గోపాల్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: