మహేష్ అల్లు అర్జున్ ల మధ్య పెద్దగా సాన్నిహిత్యం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈ ఏడాది సంక్రాంతి రేస్ వీరిద్దరి మధ్య సృష్టించిన గ్యాప్ ఇప్పట్లో సద్దుమణిగే లా లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల సక్సస్ ను తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని సంక్రాంతి పండుగకు నెలరోజులు ముందు నుండే వీరిద్దరూ చేసిన హడావిడి ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో సంక్రాంతి రేస్ కు చిరంజీవి బాలకృష్ణలు పోటీ పడుతూ తమ సినిమాలను విడుదల చేసిన ఎన్నో సందర్భాలు ఉన్నా ఎప్పుడు కూడ వారి సినిమాల జయాపజయాలను వారి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న సందర్భాలు లేవు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ ను బన్నీ మహేష్ లు తమ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని అనేక ట్విస్ట్ లను తమ సినిమాల నిర్మాతల చేత ఇప్పించడం ఇప్పుడు ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.

‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ సినిమాలకు సంబంధించి ఈ సినిమాలు విడుదల అయ్యేవరకు టీజర్లతో ట్రైలర్లతో పోష్టర్లతో పోటీ పడ్డ వీరిద్దరూ ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదలై పబ్లిక్ టాక్ కూడ తెలిసిపోయిన తరువాత నిన్నతిరోజున ఒకరు సంక్రాంతి విన్నర్ అని ప్రకటన ఇస్తే మరొకరు రియల్ సంక్రాంతి విన్నర్ అంటూ ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టి పోష్టర్స్ ను రిలీజ్ చేయడమే కాకుండా న్యూస్ ఛానల్స్ లో యాడ్స్ ఇస్తున్నారు. 


ఒకరేమో వంద కోట్ల గ్రాస్ అని వేసుకుంటే మరొకరు రియల్ కలెక్షన్స్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా బన్నీ మహేష్ ల మధ్య బాహుబలి పోటీ మొదలైంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలైన 3 రోజుల్లో చాలా చోట్ల నాన్ ‘బాహుబలి’ రికార్డులు సృష్టించిందంటూ ఏకంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది వచ్చిన కొద్ది సేపటికే ‘సరిలేరు’ టీమ్ కూడ ఎలర్ట్ అయి 5 రోజుల వసూళ్లలో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది అంటూ మరొక పోష్టర్ రిలీజ్ చేసారు. అంతేకాదు ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమాకు 68 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు  ఈ మూవీ నిర్మాతలు ప్రకటించడమే కాకుండా ఏరియా వైజ్ బ్రేకప్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి తమ సినిమా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్టు ‘సరిలేరు’ నిర్మాతలు చెపుతున్నారు. దీనితో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవ్వడమే కాకుండా బన్నీ మహేష్ ల కొనసాగుతున్న ఈ పోష్టర్ వార్ ను చూసి షాక్ అవుతున్నారు. ఈ పరిస్థితులు ఇంకా ఎలాంటి టర్నింగ్ తీసుకుంటాయో అంటూ మరికొందరు సెటైర్లు కూడ వేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: