రాజకుమారుడు సినిమాతో ప్రిన్స్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు మహేష్ బాబు ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న మహేష్ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. సంక్రాంతికి మహేష్ సినిమా రావడం హిట్టు కొట్టడం ఇది మొదటిసారి కాదు 17 ఏళ్ల క్రితం మహేష్ ఒక్కడు సినిమా కూడా సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టింది. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది.

 

గుణ శేఖర్ తీసిన మృగరాజు ఫ్లాప్ అయినా పుల్లెల గోపిచంద్ ఇంటర్వ్యూని పేపర్ లో చదివిన గుణశేఖర్ కు అద్భుతమైన లైన్ దొరికింది. తండ్రికి ఇష్టం లేకుండా హీరో ఆటల మీద ఇష్టం చూపించడం ఆ తర్వాత ఒక అమ్మాయి కోసం విలన్ కు ఎదురు నిలబడటం లాంటి కథ రాసుకుని మహేష్ కు వినిపించాడట. కథ వినగానే మహేష్ ఓకే చెప్పాడట. ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఓకే అవగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చార్మినార్ సెట్ వేసి సినిమా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఒక్కడు కాదట. అతడే ఆమె సైన్యం అని అనుకున్నారట. కబడ్డీ అనే టైటిల్ కూడా బాగుంటుందని అనుకున్నారట. 

 

అతడే ఆమె సైన్యం టైటిల్ కే చిత్రయూనిట్ మొత్తం ఓకే చేశారట. అయితే ఆ టైటిల్ వేరే వాళ్లు రిజిస్టర్ చేయించారట. అందుకే ఆ టైటిల్ మార్చాల్సి వచ్చిందట. ఇక ఫైనల్ గా ఒక్కడు అని పెట్టగా అందరు ఓకే చెప్పారు. ఒక్కడు సినిమా చూశాక ఈ టైటిలే సూపర్ అనిపించింది. అప్పటివరకు ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రమే చూసే మహేష్ సినిమాలకు యూత్ కనెక్ట్ అయిన సినిమా ఒక్కడు. ఆ సినిమాతోనే హీరోగా మహేష్ కు సూపర్ మైలేజ్ వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: