నిన్న పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ స్నేహ గీతానికి తెర లేవడంతో ఇక రానున్న రోజులలో రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ మరింత వేగం పెంచబోతున్నాడు అన్న స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఈ సంఘటన జరిగి ఒకరోజు కూడ పూర్తి కాకుండానే ఇండస్ట్రీ వర్గాలలో పవన్ ‘పింక్’ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది అంటూ వార్తలు రావడంతో అందరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

వాస్తవానికి ‘పింక్’ రీమేక్ షూటింగ్ ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ రిలీజ్ డేట్ ఎలా ఫిక్స్ అయింది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తున్న లీకుల ప్రకారం పవన్ ‘పింక్’ రీమేక్ మే 23న విడుదల చేయడానికి డేట్స్ ఖరార్ చేయడమే కాకుండా ఈ మూవీ ప్రారంభం అయిన వెంటనే ధియేటర్స్ బుకింగ్ కూడ జరగబోతోంది అంటూ లీకులు వస్తున్నాయి.

బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ లో తాప్సీ పాత్రకు పూజ హెగ్డే ఇప్పటికే ఎంపిక అయిందని ఈ మూవీ షూటింగ్ ఈనెల 20 నుండి ప్రారంభం కాబోతోందని అంటున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో పవన్ ఈ సినిమాకు సంబంధించిన లాయర్ లుక్ లో కనిపించి తన అభిమానులకు జోష్ ను ఇవ్వబోతున్నట్లు సమాచారం. 

ఈ మూవీకి సంబంధించి పూజ హెగ్డేతో పాటు నివేదా థామస్ అంజలి అనన్య మరో మూడు కీలక పాత్రలకు ఎంపిక అయినట్లు టాక్. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి వచ్చేనెల నుండి పవన్ ప్రతి నెల 15 రోజులు తన లాయర్ పాత్ర షూటింగ్ కోసం తన డేట్స్ కేటాయించినట్లు టాక్. అయితే పవన్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావడానికి కొత్త మిత్రులను కొత్త వ్యూహాలను ఎంచుకున్న పరిస్థితులలో దిల్ రాజ్ ఎంత ప్రయత్నించినా ఈ మూవీని అనుకున్న డేట్ కు రిలీజ్ చేయగాలుగుతాడా అన్న సందేహాలు ఉన్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: