లేడీ అమితాబ్ విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. పదమూడేళ్ల విరామం తర్వాత కెమెరా ముందుకి వచ్చిందంటే ఆ పాత్ర చాలా విశిష్టమైనదిగా ఉంటుందని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ పాత్రకి చాలా విశిష్టత ఉంది. ఇద్దరు పిల్లలని ఆర్మీకి పంపే అమ్మగా విజయశాంతి చాలా చక్కగా చేశారు.

 

క్లైమాక్స్ లో ఆమె మాట్లాడిన మాటలు కళ్ళవెంబడి నీళ్ళు తెప్పిస్తాయి. అనిల్ రావిపూడి సినిమాల్లో ఎక్కువ భాగం హ్యూమర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అన్నింటినీ సమభాగాల్లో అందించాడు. అటు వినోదంతో పాటు, సెంటిమెంటును కూడా జోడించి ప్రేక్షకులకి విందు ఇచ్చాడూ. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి ఈ సినిమాలో ఏదో ఒకటి నచ్చకుండా పోదు. ఒకరికి కామెడీ మరొకరికి దేశభక్తిని రగిల్చే డైలాగులు నచ్చుతాయి.

 

ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర ధారిగా నటించిన విజయశాంతి గారు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. పదమూడేళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చారు కాబట్టి చాలా ఎక్కువ ఉంటుందనే నమ్ముతున్నారు. అయితే ఇదే విషయం విజయశాంతి గారిని అడిగితే ఆమె ఆసక్తి కరమైన సమాధానం ఇచ్చారు. మహేష్ తరువాత ఎక్కువ రెమ్యూనరేషన్ నాదే అన్నారు. 

 

అంటే ఆమె పరోక్షంగా హీరోయిన్ రష్మిక కంటే తానే ఎక్కువ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి చూస్తే విజయ శాంతి ఈ చిత్రం కొరకు 1.5 కోట్ల కు పైగా అందుకొని ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు.  ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: