ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదల అయిందంటే చాలు ఆ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. సాధారణంగానే స్టార్ హీరోల సినిమాలు పెద్ద రేంజిలో విడుదల అవుతుంటాయి. అప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ నానా హంగామా చేస్తుంటారు. ఇతర హీరోలతో తమ హీరోని పోలుస్తూ తమ హీరోనే గొప్ప అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ గొప్పలని నిదర్శనంగా సినిమా కలెక్షన్లు చూపెడుతుంటారు. అయితే ఆ కలెక్షన్లలో ఎంత నిజముందనే నిర్మాతలకే తెలియాలి. 

 

అయితే ఈ మధ్య ఈ పోకడ మరీ ఎక్కువై పోయింది. అభిమానులకి తోడు నిర్మాతలు కూడా తాము సాధించిన కలెక్షన్ల ఫిగర్లు పోస్టర్లు వదులుతున్నారు. ఈ సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద చిత్రాలు తమ తమ కలెక్షన్లని చూపెట్టుకోవడం చూస్తుంటే ఎవరికైనా మతి పోవాల్సిందే. అంతే తమ సినిమానే రికార్డు క్రియేట్ చేస్తుందనుకుంటూ గొప్పలకి పోతున్నారు. కొత్త కొత్త రికార్డులు కనిపెట్టి మా సినిమానే గొప్ప అని చెప్పుకుంటున్నారు.

 


ఇంతకుముందు రోజుల్లో సినిమా రికార్డులు అంటే 100 రోజులు ఎన్ని సెంటర్లలో రన్ అయింది, ఎన్ని ఏరియాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది, ఏ ప్రాంతం నుండి అత్యధిక వసూళవసూళ్లు వచ్చాయి వంటి లెక్కలు వేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతీదీ రికార్డు కిందే లెక్క వేసుకుంటున్నారు. యూట్యూబ్ లో వ్యూస్ నుండి అమెరికాలో కలెక్షన్ల వరకు రికార్డులే. దానికి తొడు నాన్ బాహుబలి రికార్డు కూడా జతచేశారు.

 

ఈ సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలకు సంభందించిన ట్రేడ్ ట్రాకింగ్ వర్గాలు నాన్ బాహుబలి 2 ఫస్ట్ డే, సెకండ్ డే అంటూ రోజువారీ వసూళ్లను కూడా రికార్డుల కిందికి తీసుకురావడమే కాకుండా నాన్ బాహుబలి 2 నూన్ షో, నాన్ బాహుబలి 2 మార్నింగ్ షో కలెక్షన్స్ అంటూ కొత్త రికార్డుల్ని చెబుతున్నారు. మరి ఈ రికార్డుల లెక్కేంటో నిర్మాతలకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: