మన దర్శకులు ఎవరికైనా అటు సీనియర్ డైరెక్టర్స్ ఇటు యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా స్టార్ హీరోలను డీల్ చేయడం అంటే వాళ్ళ కెరీర్ తో వాళ్ళే ఆడుకుంటున్నట్టు లెక్క. ఎందుకంటే ఇక్కడ స్టార్ హీరోలు సినిమా సమయంలో టార్చర్ పెడతారన్నది కాదు టాపిక్. అప్పటి వరకు వాళ్ళకు ఉన్న ఇమేజ్ కి తగ్గట్టు.. ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేయకుండా సగటు ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా సినిమాను తెరకెక్కించడం అనేది ఏ డైరెక్టర్స్ కైనా కత్తిమీద సామే. డైరెక్టర్స్ ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళు అయినప్పటికీ వాళ్ళలో చాలామంది స్టార్ హీరోలను డీల్ చెయ్యడంలో తడబడతారు. అదే వాళ్ళ కెరీర్ కి ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. కొంతమందికైతే ఆ తర్వాత ఏ హీరో ఛాన్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి విషయంలో దాదాపు అదే జరిగింది.

 

దర్శకుడు అనిల్ రావిపూడికి ఫస్ట్ టైం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. దాన్ని సాధ్యమైనంత వరకు నిలబెట్టుకునే ప్రయత్నమే చేశాడు. కొన్ని అంశాలలో అనిల్ రావిపూడి మంచి మార్కులు తెచ్చుకున్నాడు కూడా. కానీ కొన్ని అంశాలలో మాత్రం ప్రతీ ఒక్కరిని బాగా డిసప్పాయింట్ చేశాడు. అనిల్ రావిపూడి గత సినిమాలు హిట్ అయినా కానీ ఒక కంప్లయింట్ ఏంటి అంటే.. సెకండ్ హాఫ్ బాగా వీక్ గా ఉంటుందని. అది పటాస్ నుండి మొన్న వచ్చిన సరిలేరు వరకు అన్ని సినిమాలు గమనిస్తే అర్థమవుతుంది. పైగా ఈ సినిమాకు డిఫరెంట్ క్లైమాక్స్ ఎంచుకోవడంతో సెకండ్ హాఫ్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. క్లైమాక్స్ కనుక పవర్ ఫుల్ గా ఉంటే 'సరిలేరు నీకెవ్వరు' రేంజ్ మరోలా ఉండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా చూస్తే శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల క్లైమాక్స్ చూశాక సరిలేరు క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులు చాలా ఊహించుకుంటారు. అది చాలా సహజం కూడా. కానీ అది సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.

 

ఇక సినిమాలో కొన్ని ప్లస్సులు కూడా ఉన్నాయి. మహేష్ బాబును మాస్ గా చూపించడం.. ఫ్యాన్స్ సంతోషపడేలా మహేష్ తో స్టెప్పులు వేయించడం లాంటివాటికి అనిల్ రావిపూడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అయితే ఒక్కసారి పోకిరి గనక గుర్తు చేసుకుంటే పూరీ మహేష్ తో ఇంతకంటే మంచి స్ట్పూలు వేయించాడు. ఇవన్నీ చూసుకుంటే అనిల్ రావిపూడికి ఈ సినిమా విషయంలో యావరేజ్ మార్కులే పడ్డాయని అంటున్నారు. అంతేకాదు ఇక వెంటనే స్టార్ హీరోలు అనిల్ కి అవకాశం ఇవ్వకపోవచ్చని అంటున్నారు. మరి ఎఫ్3 ప్లానింగ్ లో ఉన్న అనిల్ నెక్స్ట్ ఎం ఏం చేస్తాడో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: