ఈ ఏడాది సంక్రాంతి రేస్ విజేత ఎవరు అన్న విషయమై స్పష్ట మైన క్లారిటీ వచ్చినా అల్లు అర్జున్ మహేష్ ల మధ్య ఏర్పడిన ఇగో లు ఇంకా తగ్గ లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. వారి ఇద్దరి సినిమాలు వేరైనా రిలీజ్ టైమ్ ఏదైనా మరొక సీజన్ లో మహేష్ సినిమాతో పోటీపడి బన్నీ తన ఆదిపత్యాన్ని మరొకసారి చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

వాస్తవానికి ఇలాంటి గాసిప్పులు రావడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతుతం ‘అల వైకుంఠపురములో’ మూవీ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ సుకుమార్ తో తాను నటిస్తున్న మూవీ షూటింగ్ లో వచ్చేనెల నుండి జాయిన్ అవబోతున్నట్లు టాక్.

సుకుమార్ సినిమాలను చాల నెమ్మదిగా తీస్తాడు. దీనితో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయి ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు మాత్రమే రెడీ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇక మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత రెండు నెలలు గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మార్చి నెలలో వచ్చే ఉగాది నుండి తన కొత్త సినిమాను ప్రారంభిస్తాడు.

అయితే ఈ సినిమా పూర్తి అయ్యే సరికి కూడ ఈ సంవత్సరం చివరికి వస్తుంది కాబట్టి ఈ మూవీ కూడ వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తుంది అని అంటున్నారు. ఈ అంచనాలే నిజం అయితే మళ్ళీ బన్నీ మహేష్ ల మధ్య వార్ తప్పదు అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ మూవీ ద్వారా బన్నీ మహేష్ కు ఓవర్సీస్ లో చెక్ పెట్టిన నేపధ్యంలో మరొకసారి వీరిద్దరి క్లాష్ ఎదురవ్వడం ఖాయం అని దానికి బన్నీ కూడ ఓకె చేస్తాడు అంటూ సంకేతాలు గాసిప్పులు వస్తున్న నేపద్యంలో ఇండస్ట్రీ  వర్గాలు షాక్ అవుతున్నాయి ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: