శేఖర్ కమ్ముల సినిమాలన్నీ ఎంత సున్నితంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ సున్నితత్వం దాగి ఉంటుంది. సున్నితమైన భావోద్వేగాల్ని చాలా అందంగా తెరపైన చెప్పగలడు. అలాగే కొత్త కొత్త వాళ్లతో సినిమాలు చేసినా కూడా వారి నుండి నటనని రాబట్టుకోవడంలో శేఖర్ కమ్ముల దిట్ట అనే చెప్పాలి. మొదటి నుండి ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో ఎంతో మంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు

 

 


కేవలం నటులే కాదు టెక్నీషియన్లు కూడా పరిచయం అయ్యారు. మిక్కీ జే మేయర్ శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. హ్యాపీడేస్ మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి ఈయన అందించిన సంగీతం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాగే మొన్నటికి మొన్న తెలంగాణ ప్రాంత బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫిదా చిత్రం ద్వారా శక్తికాంత్ అనే సంగీత దర్శకుడిని పరిచయం చేశాడు.

 

 

 

 

ఈ సినిమాలోని పాటలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే ప్రస్తుతం తన తర్వాతి చిత్రమైన లవ్ స్టోరీ కోసం పవన్ సి హెచ్ అనే కొత్త దర్శకుడిని తీసుకున్నాడు. ఈ పేరు ఇప్పటిదాకా ఎవరూ వినలేదు. ఈ సంగీత దర్శకుడికి ఇదే తొలి సినిమా.  శేఖర్ కమ్ముల ఛాన్స్ ఇచ్చాడంటే అతను టాలెంటెడే అయ్యుంటాడు అని అనుకుంటున్నారు. హృద్యమైన ప్రేమకథలా కనిపిస్తున్న ఈ సినిమాలో పాటలు - నేపథ్య సంగీతానికి మంచి ప్రాధాన్యమే ఉంటుంది.

 

 

 

ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపిస్తున్నాడట. అందుకోసం తెలంగాణ యాసని కూడా నేర్చుకుంటున్నాడట. ఫిదా సినిమాతో చెరగని ముద్ర వేసిన శేఖర్ కమ్ముల ఈ సినిమాతో ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: