సంక్రాంతి పండుగ అందరికీ శని సంక్రాంతి గా మారిపోయింది. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అబ్బో అది మామూలు సందడా. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడ్డాయి. తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. వసూళ్ళ పరంగా కూడా అన్ని సినిమాలు దూసుకుపోతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన దర్బార్  సినిమా ప్రేక్షకుల అంచనాలను సంతృప్తి పరుస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత విడుదలైన మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 

 ఇక అల్లు అర్జున్ సినిమా అలా వైకుంఠపురములో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎంత మంచి వాడు రా సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ... వసూళ్ళ పరంగా మాత్రం వెనకబడి పోయాయి అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదేంటి అన్ని సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతోన్నాయి  అని ప్రచారం జరుగుతుంది కదా అంటారా... సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్స్ అని పలువురు భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్ అంటే సినిమాలకు మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... రీకార్డు  కలెక్షన్ ల పేరుతో ప్రచారం చేస్తూ సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

 

 

 రికార్డు కలెక్షన్స్ అంటూ అన్నీ చిత్ర బృందాలు ఫెక్  కలక్షన్స్ పైనే ప్రచారం చేశారని అంటున్నారు. సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పుకుంటూ సినిమాకు ప్రమోషన్ చేస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత హైప్ తీసుకురావడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అన్ని సినిమాలు నిజంగానే మరి అంత ఘోరంగా కలెక్షన్లను రాబట్టాయ అంటే... సంక్రాంతి సీజన్ కాబట్టి విడుదలైన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా కలెక్షన్లు రాబట్టడానికి అవకాశం ఉంటుంది... కాని సంక్రాంతి బరిలో ఎక్కువ సినిమాలు నిలవడం...అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో... బ్లాక్ బస్టర్ కలెక్షన్లు రావడానికి మాత్రం కాస్త సమయం పడుతుంది. కానీ చిత్ర బృందం  మాత్రం సినిమా విడుదలైన రెండు, మూడు రోజులకు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టాయి అని చెప్పుకోవడం మాత్రం అంతా ఫేక్ అంటు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: