సంక్రాంతి పండక్కి తెలుగు ప్రేక్షకులందరికీ సాంప్రదాయ సంక్రాంతి పండుగతో పాటు సినీ సంక్రాంతి పండుగ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడ్డాయి. తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. వసూళ్ళ పరంగా కూడా అన్ని సినిమాలు దూసుకుపోతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ధర్భర్ సినిమా ప్రేక్షకుల అంచనాలను సంతృప్తి పరుస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత విడుదలైన మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 

 ఇక జనవరి 12న విడుదలైన అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అలా వైకుంఠపురములో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్  అందరినీ అలరించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి రోజు విడుదలైన ఎంత మంచి వాడు రా సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇలా వరుస సినిమాలతో సంక్రాంతి సినీ  ప్రేక్షకులందరికీ మర్చిపోలేని పండుగగా మారింది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు భారీ వసూళ్లను రాబట్టడంలో పాటు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని దూసుకు పోతున్నాయి. 

 

 

 అయితే అసలు విషయం ఏమిటంటే... ఒక్క అల్లు అర్జున్ సినిమా మినహా ఏ సినిమా కూడా అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది అని టాక్ వినిపిస్తోంది. ఏ సినిమాల్లో కూడా కథా కథనాల్లో సరైన దమ్ము లేదు అని సినీ ప్రేక్షకులు పలువురు చర్చించుకుంటున్నారు. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని సినిమాలు కథలో బలం లేకపోయినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ భారీ వసూళ్లు రాబట్టాయని  కాని సంక్రాంతి బరిలో అసలు సిసలైన విన్నర్  మాత్రం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలా వైకుంఠపురములో సినిమానే అని పలువురు ప్రేక్షకులు భావిస్తారు. అసలుసిసలైన సంక్రాంతి విన్నర్ బన్నీనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: